Friday, December 12, 2014

నీ కోసమే నిరీక్షించే

నా కళ్లలోని భావం నీకు కనబడుట లేదా...?
నీ కోసమే నిరీక్షించే నా నయనాల నిస్స హయత
నీకు తెలియడం లేదా...?
నీ కోసమే కంటతడి పెట్టే నా కన్నీటి భా(ధ)ష నీకు
అర్థం కావడం లేదా....?
నీ ఎదురు చూపులో కళ్లకు కంచె వేసి నిఁదకు దరిచేరనివ్వని,
నా కన్నుల ఆవేదనను నీవు గమనించడం లేదా..?

ఎవరిని నిందించాలి నేను...?
నిన్ను నిందించాలా లేక ,
నాపై కనికరం లేని ఈ కాలాన్ని నిందించాలా..?
నిన్ను దూరం చేసుకోలేని నా మనసును నిందించాలా..!
నీ కోసమే కారే కన్నీటిని నిందించాలా..?
మనసులో ఉన్న నిన్ను మరచిపోవాలా.!
మనసులేని మనిషిగా మిగిలిపోవాలా...?

Thursday, December 11, 2014

నీతో పరిచయం

చెలీ!
నీతో పరిచయం ఆ దేవుడు నాకు ఇచ్చిన వరం
నీతో చెలిమి నిలవాలనుకున్న కలకాలం
నీతో పంచుకున్నా ప్రతిపూట ఎంతో ఆనందం
నా ఆశలు ఆలోచనలలో నిన్నే నింపుకున్నా అనుదినం
మన ఊహల ఊయలలో హాయిగా పయనించాం
నా ఊహాలోకంలో మరుపురాని అనుభూతిని మిగిల్చుకున్నాం
నీ తొలిప్రేమ జ్ణాపకం మరువదుగా నా హృదయం
నీ తొలిముద్దు అనుభవం మదిలో కదలాడెను నిత్యం
చివరకు ఎందుకిలా చేశావు నా గుండెకు గాయం...........!

పెదవులపై ప్రతి మాట

ప్రియా!
నీ ఎడబాటును తట్టుకోలేని
హృదయం కన్నీటి వర్షం కురిసింది
పెదవులపై ప్రతి మాట నీ పేరే వస్తుంది
ఎటు చూసిన నీ రూపే కనిపిస్తుంది
నీకు దూరమయ్యి ఉండటం కష్టంగా ఉంది
నీ ప్రేమను వదులుకోవడం భారంగా ఉంది
నీ ఆలోచనలే మదిలో కలవరపెడుతున్నాయి
నా గుండె చప్పుడు అయినావుగా .........నిను ఎలా మరువగలను ప్రియా!

Sunday, December 7, 2014

నీ జ్ణాపకాలతో

చెలీ!
మనసు ఎంత తుంటరిది
నిన్నే నా నిండుగా నింపుకున్నది
నీ జ్ణాపకాలతో నను బ్రతికిస్తున్నది
నీ ఎడబాటును క్షణమైనా భరించకున్నది
నీ తొందరపాటుతో నను బాధిస్తున్నది
నిజం తెల్సి నను ఒదార్స్తున్నది
నువు దూరమయి రోదిస్తున్నది
అనువణువున నిండిన నీ ప్రేమను మరువక
నీ రాక కోసం మౌనంగా......... ఎదురుచూస్తున్నది.

Tuesday, December 2, 2014

నీ కనులకు కాటుక

చెలీ!
నీ నుదుట తిలకాన్ని అవ్వనా
నీ కనులకు కాటుకనవ్వనా
నీ చెక్కిలిపై ఎర్రని మెరుపునవ్వనా
నువు తీసుకోనే శ్వాసనవ్వనా
నీ అధరాలపై చిరునవ్వునవ్వనా
నీ మనసులో ఆలోచననవ్వనా
నీ గుండె చప్పుడినినవ్వనా
నీ నడుముకి సన్నని ఒంపునవ్వనా
నీ కాలికి మెరిసే మువ్వనవ్వనా
నా చివరి శ్వాస వరకు.....నీకు తోడును...నీడను అవ్వనా!Monday, December 1, 2014

నా ధ్యాస ,శ్వాస నీవే

చెలీ!
ప్రతి ఉదయం కోయిల రాగంలా నను నిదుర లేపుతావని
నా ధ్యాస ,శ్వాస నీవే కావాలని
నా కనుపాపల ముంగిట నీ రూపం ఉండాలని
నీ ఒడిలో ప్రతి నిమిషం నిదురించాలని
నీ కమ్మని మాటలతో పరవశించిపోవాలని
ఆ మాటలకు నా గుండె చప్పుడు శ్రుతి కలపాలని
మెరిసే వెన్నెలలో నీతో విహరించాలని
నా సర్వం నీ సొంతం కావాలని
తీయని ఆశలు,ఆలోచనలు నీతో పంచుకోవాలని
ఎన్నో ఆశలు చెలి...........ఈ చిన్ని గుండెలో!

Saturday, November 29, 2014

గుండెపై కోతలే

శిలలుగా మారెనా చెలీ మన మనసులూ
ఊహలే కూలినా తడవవేం కన్నులూ
ఉప్పెనే దాచనా కంటిపై రెప్పలూ
గుండెపై కోతలే చిన్ని నిట్టూర్పులూ
నిన్న స్వప్నాలు నేడు శిధిలాలు
గుండె శకలాలు మిగిలెనే
ప్రేమ చిగురించి పూలు పూశాక
పాడు శిశిరాలు కమ్మెనే
ఒక మాటలేక మూగబోయె గొంతులు

నీ అలోచనల మంటను


చెలీ!
నాపై నీ ప్రేమను ధారగా నువు కురిపించావు
ఆపై నీ అలోచనల మంటను నాలో రగిలించావు
నీ చూపులతో నాపై పూల బాణం వేసేసావు
నా మదిలో ప్రేమ రాగాలు నువు పలికించావు
తొలి పొద్దున సూర్య కిరణంలా నను పలుకరిస్తావు
పండు వెన్నెలలో నా కవితకు ప్రేరణ అవుతావు
నీ చెలిమి కోసం ప్రతి క్షణం తపిస్తున్నాను
నీతో ఈ బంధం కలకాలం ఉండాలని కోరుకొంటున్నాను............

Tuesday, November 25, 2014

నువు దగ్గరలేనప్పుడు

చిరుగాలికి కదిలే నీ కురులను తాకుతూ
పరవసించి పోతుంటాను
నీ చూపులు పలికే భావాలకు
ఏవేవో అర్ధాలు రాసేసుకుంటాను
నిన్ను కలిసినప్పుడు మాటలు మర్చిపోయి
మౌనంతో గొడవ పడుతుంటాను
నువు దగ్గరలేనప్పుడు
నీతో చెప్పాలనుకున్న మాటలతో
స్నేహం చేస్తుంటాను
నువ్వు కనిపించినప్పుడు
చూస్తూ ఉండిపోతాను
నువు కనిపించనప్పుడు
ఊహల్లో నిన్ను చూస్తుంటాను
ఎప్పుడూ నీతోనే గడిపేసున్నాను
నీలో నేనున్నా లేకున్నా
నాలో కలకాలం నీతో కలిసే ఉంటాను.

Saturday, November 22, 2014

అల్లరి చేసే చిలిపి చిరుగాలి

చల్లగా కాసే ఓ వెన్నెలమ్మ
నా మనసెంటో నా చెలికి విన్నవించు
అల్లరి చేసే చిలిపి చిరుగాలి
నా కోరికలే ఆమెకు విన్నవించు
మకరందం చిందించే నీ అధరాలు సాక్షి
నీ సిగలో దాగున్న మరుమల్లెలు సాక్షి
నీ కౌగిలిలో బందీనై చలిరాతిరి పోయేదాక
తెలతెలవారే దాకా హద్దులు చేరిపేసి
ముద్దులు కలబోసి అల్లుకున్న అందమైన
ఈ రేయి జ్ణాపకం మరువలేని అనుభవం.......

Wednesday, November 19, 2014

నీ శ్వాసగా నే ఉన్నా

చెలీ!
నీ కనుపాపలో నా రూపం ఉంటుందనుకున్నా
నీ ఆలోచనలలో నా జ్ణాపకం చెదిరిపోదనుకున్నా
నీ అధరాలు నిత్యం నా పేరు పలుకుతాయనుకున్నా
నీ శ్వాసగా నే ఉన్నాననుకున్నా
నీ ప్రతిపనిలో నీకు తోడుగా నను ఉంచవనుకున్నా
నీ మనసులో నాకు స్థానాన్ని ఇచ్చావనుకున్నా
నీ ప్రేమను నాకు నిజంగా పంచవనుకున్నా
నీ హృదయంలో నే ఉన్నాననుకున్నా
అంతా నా భ్రమ అని తెల్సి....శూన్యంగా మిగిలున్నా.

Monday, November 17, 2014

నీ ముందు నే ఓడిపోయా

చెలీ!
నువు గుర్తొస్తున్న ప్రతి నిమిషం
నా చుట్టూ నీ జ్ణాపకాలు తిరుగుతూ
నా ఆలోచనలకు చెబుతున్నాయి
నీ ముందు నే ఓడిపోయానని
ఓసారి నీ హృదయం అంటావు
మరు నిమిషం మన మధ్య ఏమి లేదంటావు
ఒకసారి మనసులోకి వచ్చాక
ఒకరికి ఒకరిగా కలిసిపోయాక
ఉండాలి ఆ బంధం చివరి శ్వాస వరకు
కానీ ఇపుడు నాకు మిగిలింది
ఒంటరితనం ,కన్నీటి ప్రవాహం..........

Friday, November 14, 2014

నీ చెలిమి లేని జీవితం

జీవితమే ఒక విషాద నిలయం
ఈ బ్రతుకే ఒక లోతైన వలయం
నీ చెలిమి లేని జీవితం గాఢాంధకారం
నీ పలుకు వినని క్షణం నా చుట్టూ శూన్యం
నీ పిలుపు లేని దినం నను కమ్ముకుంది ఒంటరితనం
నీవు దూరమవుతావన్న ఈ నిమిషం
నా మనసునిండా ప్రవహిస్తున్నది కన్నీటి ప్రవాహం
నా గుండె గుడిలో పదిలంగా ఉన్నది నీ రూపం
నీ జ్ణాపకాలతో బ్రతికేస్తా.....నా ఊపిరి ఉన్నంతకాలం.

మరువలేని జ్ణాపకాలను

చెలీ!
ఊహాలే నా ప్రపంచంగా బ్రతికిన నాకు
నీ ప్రేమతో మరువలేని జ్ణాపకాలను మిగిల్చావు
నా మదిలో ఉప్పెనలా నీ ఆలోచనలు వస్తుంటే
నిలువరించలేని నా హృదయం మౌనంగా చూస్తుంటే
కునుకురాని నా కన్నులు నీ జాడకోసం వెతుకుతూవుంటే
అధరాలు నీ పేరును పదేపదే పలుకుతూవుంటే
నీ గుండెలో నే లేనని తెల్సి ....నువు నా దరి రావని తెల్సి
మరలా నే చూస్తున్నా..............నా ఊహలకేసి

Monday, August 25, 2014

నా కనులకు మిగిలింది

నా కనులకు మిగిలింది కన్నీరే
నువు లేని ఈ బ్రతుకు ఇక శూన్యమే 


అయినా నీ ఊహలో విహరించని
నీ రూపమే ప్రతి సెకను ధ్యానంచేయని


నీవు నా దరికి వస్తావనే ఆశ చెరిగిపోయిన ఈ నిమిషం
నా బ్రతుకున చీకటి కమ్ముకున్న ఈ తరుణం 


నా హృదయ వేదనను ఆపలేకపోతున్నా
పెదవి నుంచి మాట పలుకలేకపోతున్నా 


నీ కోసం నే కట్టిన నా కలల మేడ కూలిపోతుంది
నిను కలిసే క్షణం ఇక లేనట్లు అన్పిస్తుంది
బాధతో నా మనసు ఉప్పొంగిపోతుంది
మరణ ద్వారం నను తన దరికి చేరమంటుంది.


నీతో పంచుకోవాల్సిన క్షణాలను

నిను చూసే క్షణం కోసం
ఎన్నాళ్ళో నా ఈ నిరీక్షణ 

నువు నీ దరికి నను పిలిచిన ఆ సమయం
నా మనసులో ఏదో తెలియని ఉత్తేజం 

నేను వస్తున్నా ఎన్నో ఊహాల్లో విహరిస్తూ నీ కోసం
నీతో పంచుకోవాల్సిన క్షణాలను
మరి మరి తలచి ఎంతో సంతోషంగా చేరా నీ చెంతకు 


ప్రేమగా మనం పంచుకున్న మన తీయని జ్ఞాపకాలు
చిలిపిగా చెప్పుకున్న కబుర్లు
ఆ చల్లని సాయంకాల సమయాన
మనం గడిపిన మధురమైన క్షణాలు 


నను నిత్యం నీతోనే ఉంచుతున్నాయి
నీ ఆలోచనలలో నేనుంటానని
అంటుంది నా మనసు నిజమా చెలీ.......


నా హృదయం బాధగా

చెలీ
నిన్నటి వరకు నా కంటిలో నిండిన నీ రూపం
నువు దూరమైన ఈ క్షణం నీ జాడ తెలియక
నా కనుపాప నీకై ఎదురుచూస్తుంది 


నీతో కోరుకున్న జీవితం
ఇక రాదని తెలిసి
నా హృదయం బాధగా రోదిస్తుంది


జాలిలేని ఈ విధిరాతని
ఎదిరించి నిను గెల్చుకుంటా
నీపై నా ప్రేమను నిరూపించుకుంటా 


ప్రేమ దక్కనివాడు ప్రాణం తీసుకోవడం తప్పు
అని సగర్వంగా లోకానికి చాటుతా
ప్రేమకు మరణం సరికాదని
ప్రేమించే మనసుని పొందడమే
నిజమైన గెలుపని నిరూపిస్తా.

Tuesday, May 20, 2014

నువ్వు వెలివేసిన హ్రుదయం

నిన్ను తలవకుండా  నిమిషం
అయినా ఉండాలని అనుకుంటా…
కాని నువ్వు వదిలి వెల్లిన
మనసు నాకన్న నిన్నే
ఎక్కువగ తలుస్తుంది….!!

నీ పేరుని అయినా   
మరిచిపోదామని పెదవిని
మౌనం తో బంధిస్తే…….
నువ్వు వెలివేసిన హ్రుదయం
నీ పేరు ని
గుండె చప్పుడు గా మార్చుకుంది….. 

నీ రూపాన్ని అయినా 
మరిచిపోవాలని కను
రెప్పను అడ్డుపెడితే….
కను పాప కమ్మని స్వప్నంలో 
నిన్ను దాచుకుంది…..

నీ జ్ఞాపకాలని అయినా  
మరిచిపోవాలని కన్నీటిని
వదిలేస్తే… . 
కన్నీరు హ్రుదయ పుటంలొ
కవితలా అల్లుకుంది…… . 


Monday, May 19, 2014

నా ఆత్మ చిరుగాలిలా

నిద్ర రాని నా కళ్ళు
నిన్ను చూడాలని
కోటి నక్షత్రాలుగా మారి
ఆకాశంలో వేచి వున్నాయి
నా ఆత్మ చిరుగాలిలా మారి
నిన్ను తాకుతుంది
నా ప్రతీ తలపు నువు పీల్చే
శ్వాసగా మారి
నిన్ను చేరుతుంది
నీకు తెలుస్తుందా
నువు బజ్జొన్నది
నా వెచ్చని వడిలో అని...Saturday, May 17, 2014

నీ మనసుమందిరంలో.....

కనుల ముందర నీ జ్ఞాపకం
కదులుతున్న వేళ...,
రెప్ప వాల్చలేక నిస్తేజంగా
చూస్తుంది నయనం...,
మరపురాని నీ పరిచయం
దూరమైన ఆ క్షణం....,
మరుజన్మకైన వేచి
ఉంటానంటోంది నా హృదయం...,
కరుణించి చోటిస్తావా
నీ మనసుమందిరంలో...........!!!!

Monday, May 12, 2014

ఈ ప్రాణం ఉండదుగా

నవ్వాలో,ఏడవాలో తెలియట్లేదు బాధని చూస్తే
పాపం కంటిపాప కన్నీరు పెడుతోంది
దీనికి తెలియదేమో నీ స్నేహమే
నా ఆశలని ఆవిరి చేసిందని.
అయినా ఎందుకో ఈ రోదన....
పిచ్చి మనసు బాధ పడుతోంది
దానికి తెలియదేమో నీ స్నేహమే
నా నమ్మకాన్ని మోసం చేసిందని.
అసలు ఏమిటో ఆ వేదన....
ఏడవని,ఎన్ని రోజులు ఏడుస్తోందో?
కన్నీరు ఇంకిపోయేవరకు ఏడవని.
బాధపడని,ఎంతా కాలం బాధపడుతోందో?
గుండె పగిలిపోయేవరకు బాధపడని....
నీ స్నేహం నా ప్రేమని ఓడించిందని తెలిసినా
ఆగని ఊపిరికి నేను కచ్చితంగా గేలుస్తానని
సమాధానం చెబ్తా కాని చెప్పేందుకు
ఈ ప్రాణం ఉండదుగా......!!

నా ప్రేమని తుంచేసావని

మదిలో దాచిన మౌనానికి తెలుసు
నీ మాటకి అర్ధం ఏమిటో
రెప్పల మాటున దాచిన కన్నీటికి తెలుసు
నీ చూపుకి అర్ధం ఏమిటో
కాని ఆ మాటకి అర్ధం స్నేహమంటే
ఆ చూపుకి అర్ధం చెలిమి మాత్రమే అంటే
చిగురిస్తున్న నా ప్రేమని తుంచేసావని
మౌనం తో ఎలా చూపను
కన్నీటితో ఎలా చెప్పను......!

Friday, May 9, 2014

నా మనసును తొలిచేస్తుంది...

నీ మౌనం నా మనసును తొలిచేస్తుంది...
ఈ ప్రాణం నువ్వు లేకుండా
తను బ్రతకలేనంటుంది...
నీకై నేను కార్చే ప్రతీ కన్నీటి చుక్క ,
నీ పై నా ప్రేమను ప్రతిబింబిస్తుంది...
నీకై నా మనసు పడే ఆవేదన ,
ఆర్తనాదంలో కలిసి ఆకాశాన్నంటింది...!!
మాటలే కరువయ్యి మౌనమై మూగపోతున్నాను...!
ఆశలే అశ్రువులై , అశ్రు ధారగా కురుస్తున్నాను...!!
గుండెలోని బాధను మది గదిలో బంధించి,
నీ పై నా ప్రేమను అనంతమైన వాయువుగా మలచి,
నిన్నే నా ప్రాణంగా తలచి,
వేచి చూస్తున్నా నీకై , మదిని తెరిచే ప్రేమకై..!!

Saturday, May 3, 2014

ఎంత అందమో

ఆకాశంలో పండు వెన్నెల జాబిలి ఎంత అందమో
నీ రూపం అంత అందం.....

పారే సెలయెరు ఎంత అందమో
నీ వాలుజడ అంత అందం....

కొలనులో కమలం ఎంత అందమో
నీ కనులు అంత అందం.....

ఉదయించే భానుడు ఎంత అందమో
నీ నుదటి పై సింధురం అంత అందం....

పచ్చని పైరులో వరి ఎంత అందమో
నీ కురులు అంత అందం....

చీకటకి వెలుగు ఎంత అందమో
నీ పెదవుల పై చిరునవ్వు అంత అందం....

వసంతకోకిల గానం ఎంత అందమో
నీ స్వరం అంత అందం....

నెమలి నాట్యం ఎంత అందమో
నీ నడక అంత అందం....

నింగిలో వర్షపు చినుకు ఎంత అందమో
నీ దేహం పై స్వేద బిందువు అంత అందం.....

కడలిలో ముత్యం ఎంత అందమో
నీ మనసు అంత అందం....

Tuesday, April 29, 2014

నా గుండెని అడుగు

ప్రియా 
 ఎదురుచూపు ఎంత తీయనీదో నా కనులని అడుగు........
నీ మాటకున్న తియ్యదనమెంతో నా చెవుల
ని అడుగు........
ప్రతిక్షణం నీ ఆలోచనలలో జీవిస్తున్నా నా తలపు
ని అడుగు....
నిన్ను చూడనీ ఆ రోజు నా కళ్ళలో కన్నీళ్ళ
ని అడుగు........
నువ్వు నా ఎదుట వున్నప్పుడు ఎంత ఆనందపడుతానో
నువ్వు తిరిగి వెళ్ళినప్పుడు నా కనులు ఎంత రోదిస్తయో నా బాధ
ని అడుగు.........
ప్రతిక్షణం నిన్నే తలిచే నా గుండె
ని అడుగు.........
ప్రతిరోజు నిద్రలో వచ్చే నా తీయటి కల
ని అడుగు......
నీవు నా ఎదుట వచ్చినప్పుడు మూగబోయిన నా మనసు
ని అడుగు.
నీ కనులు చూసి సిగ్గుతో మాట్లడిన నా కనులు
ని అడుగు......
ప్రతిక్షణం నిన్నేతలిచే నా జ్ఞాపకాన్నీ అడుగు..............
నా మనసార ప్రేమించే నా మనసు
ని అడుగు ప్రేమంటే ఏ౦టో......
ఏదో ఒకరోజు నా ఎదురుచూపలకు ముగింపునిస్థావ
ని ఆశతో......
నీ గుండెచప్పుడు......

నువ్వే నువ్వే....

నా ఆనందం నువ్వే
నా మోదం నువ్వే....
నా వెలుగు నువ్వే
నా చీకటి నువ్వే......
నా మరణం నువ్వే
నా ప్రాణం నువ్వే....
నా ప్రేమ నువ్వే
నా ఎడబాటు నువ్వే.....
నా పయనం నువ్వే
నా జీవిత గమ్యం నువ్వే....
నా కళ్ళు నువ్వే
నా కనుచూపు నువ్వే....
నా గుండే నువ్వే
నా గుండే చప్పుడు నువ్వే....
నా స్వప్నం నువ్వే
నా మెలుకవ నువ్వే.....
నా పలుకు నువ్వే
నా మౌనం నువ్వే......
నా చిరునవ్వు నువ్వే
నా రోదన నువ్వే.......
నా తలపు నువ్వే
నా వలపు నువ్వే.......
నా అక్షరం నువ్వే
నా కవితవు నువ్వే......
నా అణువణువునా నువ్వే
నా జీవితం నువ్వే.....
మోడుబారిన నా మనసుకు నీ చిరునవ్వుతో ప్రేమనీ పుట్టించావు.....
కంటికి కనిపించని దూరంలో నీ వున్నా
నా కనుపాపలో దాగుంది నీ రూపమే........
నీ అమాయకపు మనసు చూసి నా మనసు నీకు అర్పించాను...... 


ఒక్క క్షణం చాలు..

ఎవరినీ ఆరాధిస్తుందో తెలియదు....
ఎందుకు ఆరాధిస్తుందో తెలియదు...

ఇ పిచ్చిమనసు ఎవరినీ ఎప్పుడు ఇష్టపడుతుందో తెలియదు....
ప్రేమ కలగడానికి ఒక్క క్షణం చాలు..
ప్రేమ కలగడానికి ఒక్క చూపు చాలు.
ప్రేమ కలగడానికి ఒక్క మాట చాలు..

ఎన్ని జన్మలైన మరచిపోదు
నీ ప్రేమనీ......

నా తీయటీ ప్రేమ కావ్యం
నీ తొలిప్రేమ.........

నువ్వులేక నేనులేను

నువ్వులేని నా ప్రేమకు గుండేందుకు
నువ్వులేని నా ప్రాణానికి ఉపిరెందుకు
నువ్వులేని నా పయనానికి గమ్యం ఎందుకు
నువ్వులేని నా చీకటి బ్రతుకుకి వెలుగు ఎందుకు
నువ్వులేని నా కవితకు అక్షరం ఎందుకు
నువులేని నా జన్మ ఎందుకు
నువ్వులేని నా బ్రతుకుకు సంతోషం ఎందుకు
నువ్వులేని నా తలపుకు ఊహ ఎందుకు
నువ్వులేని నా కంట్లో కన్నీళ్ళు ఎందుకు
నువ్వులేని నా గుండేకు చప్పుడు ఎందుకు
నువ్వులేని నీ రూపం చూడనీ నా కనులు ఎందుకు
నువులేని నా జీవితం ఎందుకు.......
నువ్వులేక నేనులేను
నువ్వులేక ఎప్పటకి నేనుండాలేనునువ్వులేక నేనులేను
నేనులేను

Monday, April 14, 2014

కళ్ళలోని కన్నీరు

గుండెలోని బాధ గునపమై గుచ్చేస్తుంది...!!
మనసులోని మౌనం మనిషిని తొలిచేస్తుంది...!!
కళ్ళలోని కన్నీరు కాలువై ప్రవహిస్తుంది ...!!
ప్రేమలోని విరహం ప్రళయమై ముంచేస్తుంది
శిలలాంటి ఈ రూపం శిధిలమై కృశించిపోతుంది ..!!

నీవు లేని నేను

ఎందుకో తెలీదు నువ్వంటే పిచ్చి ప్రేమ నాకు...!!
ఎంత పిచ్చి అంటే...?

నీ ఇష్టం నా ఇష్టంగా ,
నువ్వే నా ప్రపంచంగా ,
నీ ఊ పిరే నా ఆయువుగా
నీ శ్వాసే నా ఆశగా ,
నీ రూపమే నా గుండె గూటిలో కొలువైనంతగా ...!!

ఒక్క మాటలో చెప్పాలంటే...!!

నువ్వు లేని ఈ జీవితం శూన్యం...!!
నీ ప్రేమ లేని ఈ ప్రాణం జీవచ్ఛవంతో సమానం...!!

ప్రియ సఖా...!

నాలో ఊ పిరి ఉన్నంత వరకు ,
ఈ తనువులో శ్వాస ఆగేవరకు,
నే వేచి ఉంటా నా పై నీ ప్రేమ కొరకు...!!

అందరూ ఆశించేది ఆనందంతో కూడిన రంగుల ప్రపంచం..!!
నేను కోరుకునేది ప్రేమతో నిండిన నీ సమక్షం...!!

అనంత ప్రాణకోటి మొత్తం శ్వాసను పీల్చి బ్రతుకుతుంటే ,
నేను మాత్రం నీ పై నా ప్రేమను ఆయువుగా మలచి జీవిస్తున్నాను...!!

నీవు లేని నేను శూన్యం ...!!
నీ ప్రేమ లేని ఈ జీవితం వ్యర్ధం..!!

నా చివరి శ్వాస ఆగే వరకు ,
నా ఈ కట్టే కాలే వరకు నీ పై నాప్రేమ నిత్యం సత్యం ...!!

నా మనసు పలికే

నాకు తోడుగా ఉండే నా నేస్తం...!!

నీతో మనసువిప్పి మాట్లాడాలి అనుకున్న క్షణం
నా మనసు పలికే రాగాలను నీకు వినిపించలేక
మౌనమే సమాధానంగా నా గొంతు మూగబోతుంది...!!

నిన్ను చూస్తూ నా మనసు కలల లోకంలో విహరిస్తుంది...
నీ నీడే నేనుగా , నీ శ్వాసే నా ఉపిరిగా, నీతో విహరించే
మదురమైన క్షణాలను చూస్తూ కాలం కరిగిపోయింది...!!

కానీ నీతో 'చెప్పాలన్న మాట' మాత్రం మిగిలి పోయింది...
------------ "రేపటి కోసం" -------------

నువ్వు చూసే ప్రతీ చూపు

ఎగిసిన ప్రతీ అల తీరాన్ని తాకుతుందో లేదో తెలీదు కానీ ...!
నువ్వు చూసే ప్రతీ చూపు నా గుండెను తాకుతుంది...!!
దూసుకోచ్చే ప్రతీ చినుకు భూమిని ముద్ధాడుతుందో లేదో తెలీదు కానీ..!
నువ్వు నవ్వే ప్రతీ నవ్వు నా హృదయాన్ని ముద్దాడుతుంది...!!
ఆకాశంలో మెరుపు మెరుస్తుందో లేదో తెలీదు కానీ...!
నా మనసుకు మాత్రం నీ ఫిలుపు వినిపిస్తుంది..

గుండెలోని బాధ

మనసు లోతుల్లో ఏదో బాధ ..

దేని కోసమో వెతుకులాట ...?
ఎవరి కోసమో ప్రాకులాట ...?

కళ్ళ వెంట నీరు నదిలా ప్రవహిస్తుంది ...
గుండెలోని బాధ చెరువులా ముంచేస్తుంది ...

ఏదో పోగొట్టుకుంటున్నట్టు...?
ఇంకేదో దురమవుతునట్టు ...

చుట్టూ ఎంత మంది ఉన్నా ఒంటరితనం కమ్ముకుంటుంది
నా ఆలోచన(లు )లలో నాకంటూ తావు లేకుండా వేరే ప్రపంచంలో
విహరిస్తున్నాయి

ఎవరికోసం ఈ ఆరాటం ..?
దేనికోసం నామనసు చేస్తున్న ఈ పోరాటం ...?

కళ్ళల్లో నీరు కట్టలు తెంచుకుని ప్రవహిస్తుంది...
గుండెల్లో బాధ గునపమై గుచ్చుకుంటుంది ...

ఎన్నటికి ఆగేను ఆ కన్నీరు ...?
ఎప్పటికి తీరేను ఈ హ్రుదయ పొరు... ?

నువ్వంటే నాకు పిచ్చి

ప్రతీసారి నీకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్న.
అర్థం చేస్కోవేం...?
ఎందుకు నాకు ఊర్కే ఫోన్ చేస్తావ్...?
నేనేమైపోతే నీకేంటి...?
మళ్ళి నా జీవితంలోకి రావాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావ్..?
నాకు నువ్వంటే పిచ్చి...
ఆ పిచ్చిలో నా జీవితాన్ని కోల్పోతానేమో అని భయమేస్తుంది..
మనం ఈ జన్మలో కలవలేం..
అలాంటప్పుడు మనమధ్య ఈ అనుసంధానం అవసరమా..?
నువ్ నా బలహీనత..
నా బలహీనతతో ఆడుకోవడం నీకు ఆనందాన్నిస్తుందా..?
నాకు తెలుసు నేనంటే నీకు చాల ఇష్టమని...
నాకు తెలుసు నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావని..
నీకు ముందే చెప్పాను
నన్ను మర్చిపోవడం నీకు నువ్వనుకున్నంత సులువు కాదని
నేను కూడా నీ గురించి ఇలానే అనుకున్న...
నువ్వంటే నాకు పిచ్చి... పిచ్చి కాదు ప్రాణం...
కాని మనం కలవలేం
మన మద్య మనకు తెలియని అడ్డంకి ఉంది.
దాన్ని దాటుకుని నీచెంతకు రాలేను
నిన్ను నాదగ్గరకి రానివ్వను...
ఒకప్పుడు భయపడ్డాను
నేను లేకుండా నువ్ ఎలా బ్రతుకుతావోనని
కాని నేను లేకున్నా
నువ్ హ్యాపీ గా ఉండగలవని నువ్వే నేరూపించావ్ కదా బంగారు
నిర్దాక్షిణ్యంగా నన్ను దూరం పెట్టావ్ కదా
ఇప్పుడు దగ్గరకు రమ్మంటే ఎలా రావాలో అర్థం కావడం లేదు
నేనన్న మాటలు నన్నే సూదుల్లా పోడుస్తున్నాయ్
నువ్ చేసిన పనులు నన్ను అధః పాతాళానికి నేట్టేస్తున్నాయి
నీ నేను ఏనాడో మరణించాను
నాకు నేనుగా బ్రతుకుతున్న
ప్రశాంతంగా గతం వీడి భవిష్యత్ లోకి ప్రయాణిస్తున్న
మళ్ళి నా జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తున్నావ్
నా బలహీనత ఏంటంటే
మళ్ళి నీ ప్రేమలో సులభంగా పడిపోగలనునీవు రావని తెలిసి

నీ రాకకై , నీ చూపుకై ఎదురుచూసిన నా హ్రుదయం
నీవు రావని తెలిసి మౌనంగా రోదిస్తుంది ....

నీ తలపుకై , నీ పిలుపుకై ఎదురుచూసే నా మనసు
నీవు లేవని తెలిసి మాటలు రాక మూగబోయింది .....

కళ్ళకు ఆనకట్ట వేసి కన్నీళ్లను ఆపగలుగుతున్నాను కానీ ..!
సాగరతీరంలో కెరటాల వలె ఎగసిపడే
నా హృదయా వేదనను ఆపలేక పోతున్నాను ....

నా కళ్ళలో నుండి

ఏదో తెలియని భయం వెంటాడుతోంది
దయలేని కాలం
నా కళ్ళలో నుండి
నీ కలల్ని దొంగిలిస్తుందేమోనని

నీపై పెంచుకున్న ఆశలన్నీ
కాగితపు పడవలై కన్నీటి వరదలో
కొట్టుకుపోతాయేమోనని

ప్రతికూలించని పరిస్థితులు
నిన్ను నా నుండి లాగేసుకుంటాయేమోనని

నేను నీ జీవితంలో ఓ జ్ఞాపకంగా
మిగలాలనుకోవడం లేదు

నీ జీవితమే నేనవ్వాలనుకుంటున్నాను