Thursday, March 1, 2018

ఎవరు నువ్వు?

ఎవరు నువ్వు?
శిలగా మారిన నా హృదయాన్ని
ఉలితో మళ్ళీ ఎందుకు చెక్కుతున్నావు?
మాసిన గాయాన్ని, మూసిన తలపుల తలుపులను
తెరవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు?
అడిగితే కారణం చెప్పవు.
పైగా నాకా హక్కు లేదంటున్నావు.
ఎవరు ఇచ్చారు నీకు ఇంత చనువు?  

Monday, June 15, 2015

కారే కన్నీళ్ళకి

గుండెలోని బాధ కళ్ళలో
నీరుగా మారి
కారిపోయిన క్షణాలెన్నో..

గుండె కరగలేదు
నీరు ఇంకలేదు..

జరిగేది జరుగుతూనే ఉంది
కారే కన్నీళ్ళకి చెలియ కట్టలు లేవు ..

సాగేది జీవితం
జరిగేది సంఘర్షణ.

మనసుకూ మనిషికీ
మిగిలేవి కన్నీళ్ళే...

కళ్ళ నిండా నీరే
తోవ కానరాని కన్నీటి చెలమలే..

అడుగడుగున
గుండె బరువు తీరినా..

మనసు కుదుట పడినా
కన్నీళ్ళ వల్లేనేనేమో. ..

కురిసి కురిసి వెలవటం
ఆగి ఆగి వర్షించటం కళ్ళకే తెలుసేమో..

లోతే తేలని అంతరంగపు
ఊటబావులు కళ్ళు..

దెబ్బ మనిషికి తగిలినా
మనసుకి తగిలనా,మనవారికి తగిలినా-
ముందుగా వచ్చేది మత్రం కన్నీళ్ళే..

ఏదురు చూపులెన్ని చూసినా
అలసిపోవు.
ఎండమావి రూపాలయినా
వెతకనీయవు కళ్ళకొలికెలు...

వయసు తారతమ్యాలను
లింగ బేధాలను సయితం
మరచి కారుతాయీ కన్నీళ్ళు..

ఆనందంలోనూ,బాధలోనూ
తోడు వస్తాయి ఈ కన్నీళ్ళు

Saturday, June 13, 2015

మనసు మనసులో లేదే

తనని చూశాక..
నన్ను నేను మరచాను..
చూసింది కళ్ళతోనే
నిలచింది మనసులో..

మనసు మనసులో లేదే-
ఇదేం మాయో..
ఉన్నది నేలపైనే
ఎగురుతున్నట్టుంది గాలిలో..
ఎమయిందో ఎమో నాకు..
సంతకం చేసినట్టుంది తొలివలపు..

నింగీ-నేలా కలసినట్టు
పగలూ-రాత్రి జంటయినట్టు
సూర్యుడు వెన్నెల కురిపిస్తున్నట్టు
నేలపై ఎగురుతున్నట్టు
గాలిలో తేలుతున్నట్టు
మంచు కాలినట్టు
మనసు చెదిరినట్టు
ఏమిటో ఈ అల్లరి
మనసు చేసే గారడీ
వయసు దానికి జోడీ..

Monday, June 1, 2015

నువులేని నిమషాలు

ప్రియా
నే మునిగిపోయా నీకమ్మనీ తలపులలో
నువుతప్ప వేరే ఆలోచనలు లేవు గుండెలో
నువులేని నిమషాలు లేవు నా ప్రతిపనిలో
ఎందుకు ఇలానను బందించావు నీఊసులలో
మరువలేని గుర్తులను మిగిల్చావు హ్రుదయంలో
ఇపుడు కనిపించకుండా రగిల్చావు బాధను మనసులో
ఒంటరిగా నేచూస్తున్నా నీకోసం కన్నీటితో
ఇక నీవు లేని నాజీవితాన బ్రతకలేక చావాలనుకుంటున్నా.


Wednesday, May 13, 2015

ఒంటరిగా బ్రతకమని

ప్రియా
నీకు దూరం అయి నాబ్రతుకు భారం అయింది
కనుల నిండా కన్నీరే మిగిలింది
విధి ఆడిన ఆటలో నే బలిఅయిపోయా
నా ఊపిరి అయిన నీవు నను విడిచిపోయావు
తిరిగిరాని లోకానికి నాతోడు లేకుండా
ఒంటరిగా బ్రతకమని నను ఒదిలేసిపోయావు
నీ హ్రుదయంలో కలకాలం దీపంలా వెలగాలనుకున్నా
చివరికి నాజీవితం చీకటి అయి నిరాశగా కూచున్నా
ఆనందఘడియలు సమాధిచేస్తూ
శోకంతో జీవించమని వదిలేసావు.


Saturday, May 2, 2015

మనసు ఎందుకో

ప్రియా
నీవు పరిచయం అయిన కొద్దిరోజులకే
చిగురించెను నాలో కొత్తఆశలు
ఇన్నిరోజులు మూగగా ఉన్న నాఆలోచనలు నీరాకతో
ప్రతినిమిషం నీతలపులలో తేలిపోతున్నవి
మనసు ఎందుకో దిగులుగా ఉంటుంది
నీమాట వినకపోతే అనుదినం
నువు లేకుండా ఒక్కఘడియకూడా ఉండలేను
అంటున్నది నా హ్రుదయం
నీతోడు లేకపోతే ఏమవుతుందో ఈ జీవితం

Sunday, April 26, 2015

ఓ క్షణం కళ్ళు మూసుకుంటే

నా మదిలో గుట్టుగా దాచిపెట్టిన గుప్పెడు ఊహలు స్వేచ్ఛగా గువ్వల్లా ఎగరాలనిఉవ్విళ్లూరుతున్నాయి..
ఓ క్షణం కళ్ళు మూసుకుంటే రెప్పల మాటున రోజు గడిచినట్టుంది..

గోడకున్న కుందేలు గడియారం చెవులు పట్టుకు ఎంత లాగినా ఒక్క ఘడియా కదలదే!
ఒక్కో సూర్యోదయం కోసం ఎన్నెన్ని అహోరాత్రాలు వేచి చూశానో కదా!

అలా కొన్ని యుగాల నిరీక్షణ అనంతరం నా తపస్సు ఫలించి నా కళ్ళ ముందు నువ్వు అవతరించావు..
నీ సాక్షాత్కారానికి అచ్చెరువొంది నే రెప్పవేయడం మరచి చూస్తుండిపోయాను..

అంతదాకా పోగేసిన నా ఊహలన్నీ నీ సమక్షంలో ఊసులుగా మారకుండానే మూగబోయాయి..
నీ మనోహర రూపం నా కళ్ళల్లో నింపుకుందామన్న పిచ్చి ప్రయత్నంలో ఘడియొక క్షణంలాకరిగిపోయింది..

నీ కంటిపాప వెలుగులో నా ప్రతిబింబం చూసుకుంటూ హృదయ నివేదనం చేసేలోపే రెప్పపాటులో అంతర్దానమయ్యావు..
ఆ మధురక్షణాల ముత్యాలసరాన్ని భద్రంగా దోసిట్లో పట్టుకుందామనుకుంటుండగానే చేజారి చెల్లాచెదురై పోయింది..
సప్తవర్ణరంజితమైన స్వప్నమొకటి రంగులన్నీ వెలిసిపోయి బోసిగా మిగిలిపోయింది!