Monday, December 30, 2013

మనసు మాటు భావాలేవో

కనులు తెలిపే కథలు ఎన్నో
వెలికి రాను పొమ్మన్నాయి
మనసు మాటు భావాలేవో
పెదవి దాటి రానన్నాయి
ఈ వసంత యామినిలోన గోదావరి తీరం లోన
ఊసులెన్నో .......నీతో పంచుకున్నాయి
బాసలెన్నో....... నీతో చేసుకున్నాయి
నిండు మనసే ఓ తెల్లని కాగితమైతే
పండు వలపే ఆ వెన్నెల సంతకమైతే
మల్లెపూలే నా మనసును తొందరించాయి
పిల్లగాలులే కమ్మని విందు చేసాయి




Thursday, December 26, 2013

నిన్ను చూడొద్దని

మనసుకి సంకెళ్ళు వేసాను
నిన్ను పిలవొద్దని
కలలకి కళ్ళెం వేసాను
నిన్ను చూడొద్దని
అడుగులకి అడ్డం పడ్డాను
నిన్ను చేరొద్దని
తలపులకి తాళం వేసాను
నిన్ను తలవొద్దని
నిన్ను మర్చిపోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాను
నువ్వున్నది నా జీవితంలో కాదు
నాలోనే అనీ...
నిన్ను మర్చిపోవడం అంటే
నా వూపిరి ఆగిపోవడమే అని...
తెలుసుకున్నాను♥♥


Tuesday, December 24, 2013

నువ్వంటే నేనే కదా

"..ముళ్ళున్న రహదారిలో
మువ్వలా వాలిపోయావు
కమ్ముకున్న కళ్ళకు
కమ్మని ఊసులు చెప్పావు
దారి తెలియక తచ్చట్లాడుతుంటే
చేతికర్రై చేయూతను అందించావు
ఒంటరి ప్రయాణంలో సాహచర్యంలో ఉన్న
గొప్పదనం ఏమిటో రుచి చూపించావు ..
అప్పుడు ప్రతి నిమిషం ..ఓ అధ్బుతం అనిపించింది
ఇద్దరం ఒకే స్వరమై..ఒకే హృదయమై ..ఒకే గుండె గొంతుకై
కలిసి పోయాము ..కమ్మని కబుర్లు చెప్పుకున్నాము
నింగి నేలను ముద్దాడినట్టు
చందమామ సూర్యుడిని తాకినట్టు
జలధి జగతిని చేతిలోకి తీసుకున్నట్టు ...సాగిపోయింది ...
ప్రేమ మొలకెత్తిన సమయంలో నన్ను మనిషిని చేసింది ..
మానవత్వం నేర్పింది ...ప్రేమతనపు లోకంలో విహరించేలా చేసింది ...
నువ్వంటే నేనే కదా.."

Sunday, November 24, 2013

నాప్రాణమే పోతుంది

మౌనంగా మాటాడలేక చూస్తూ ఉన్నా
మళ్ళీ  ఎప్పుడు కలుస్తామో ..

ఇన్నాళ్ళ సాంగత్యంలో ఏనాడు లేని భావన
ఈరోజు నీవు దూరం అవుతూ ఉంటే
నాప్రాణమే పోతుంది అన్న భావన
మదిని తొలిచి వేస్తుంది

దగ్గరగా నువ్వు ఉన్నన్నాళ్ళు  నన్ను నేను మరిచా
నేడు నీవు వెళ్తునావు అంటే నిన్ను మరవలేక ఉన్నా

దగ్గరలో తెలియని భావం
నీవు దూరం అవుతూ ఉం
టే
దాని విలువ తెలిసి వస్తూ ఉంది

కోపాలు అలకలు దీనితోనే  సగం సమయం
ఇప్పుడు అనిపిస్తూఉంది
ఇంకాస్త సమయం ఉం
టే బాగుండు అని

చెప్పలేక మౌనంగా ఉన్నా 
మదిలో చెప్పుకుంటూ  నిన్ను బాధిస్తే మన్నించు
ఒక్క అవకాశం వస్తే నీ చేయి ఎన్నడు వీడను అని

కాలంతో ప్రాయాణం మొదలు పెడుతూ
నీ జ్ఞాపకాలని పదిలం చేసుకుంటూ 
నీ రూపు గుండెల్లో దాచుకుంటూ 
భారంగా వెనుదిరుగుతూ  ..

Wednesday, November 20, 2013

గుండెలో ప్రేమ

చీకటి కోసం
రాత్రి దాక వేచి ఉండక్కర్లేదు
కళ్ళు మూసుకుంటే చాలు !
వెన్నెల కోసం
పౌర్ణమి దాక ఎదురు చూడక్కర్లేదు
గుండెలో ప్రేమ ఉంటే చాలు !
ప్రకృతి మనిషి లోనే ఉంది
అలంకృతి మనసు లోనే దాగుంది !

Tuesday, November 19, 2013

ఎందుకు?

నా తలపులను తెలుసుకోలేనప్పుడు
నా భాష వెనకన భావం 

భరించరానిదిగా మారినప్పుడు
ఈ నిఘంటువులెందుకు? 

గుండెకోతతో రాసే ఈ రాతలెందుకు..? -- తెలుగమ్మాయి నుండి
 

నాకు నటించడం

నేనెప్పుడూ నేనులా
ఉండాలనే కోరుకుంటాను
నాకు నటించడం చేతగాదు
కష్టాలూ కన్నీల్లూ నాకు తెలుసు
ప్రేమించడం స్నేహించడమూ తెలుసు
అందుకే
నేను మరెవ్వరిలానూ ఉండలేను
-- తెలుగమ్మాయి నుండి

Monday, November 18, 2013

నా గుండెల్లో

నా చేతులతో
దుఖాన్ని కౌగిలించు కున్నా
అది నా గుండెల్లో ఇంకి పోయింది
నా కళ్ళ తో
వర్షాన్ని కోరుకున్నా
అది భూమి తల్లి గుండెల్లో ఇంకి పోయింది
అయితేనేం
మట్టి పోత్తిల్లలోంచి
ఓ విత్తనం మొలకెత్తినట్టు
నా హృదయం లోంచి
ఓ చిరు ఆనందం చిగిరించింది ----
తెలుగమ్మాయి నుండి

Sunday, November 10, 2013

ప్రేమ తిలకం

నీ ద్వేషంతో నన్ను చుట్టేస్తే
పట్టుపురుగై అందులోనే మరణించి
నీవు చుట్టుకునే పట్టుచీరనౌతా.
నీ కోపంతో నన్ను కాల్చేస్తే
ఆ మంటల్లో నల్లగా మసిబారి

నీ కలువ కన్నులకు కాటుకనౌతా.
నేనంటే ఇష్టమున్నా వలచకవోతే
నా గుండె కార్చే రక్తంలో తడిసి
నీ నుదుటిపై ప్రేమ తిలకాన్నౌతా. ... తెలుగమ్మాయి నుండి

Saturday, November 9, 2013

బొట్టు ఎందుకు ధరించాలి?

ఎంత మంది హిందువులు కనీసం నుదుటన బొట్టు ధరిస్తున్నారు? కొందరు బొట్టు పూజా సమయములో ధరించి తరువాత తుడిచేసుకుని బయటకు వెళ్తున్నారు ఎందుకు సంకోచిస్తున్నారు బొట్టు ధరించటానికి? హిందూ సాంప్రదాయాలు తెలిపే ధోవతి కట్టడం నేడు చాల మందికి తెలియదు అదే విదేశీ సంస్కృతి ని తెలిపే జీను పాంటులు ధరిస్తున్నారు కనీసం ఆలయం లో ప్రవేశించేతప్పుడైన మన సంప్రదాయాన్ని గౌరవించటం చేయటం లేదు ఒకరని కాదు అమ్మాయిలూ, అబ్బాయిలు, కూడా .. పెద్దలు నుదుట బొట్టు ధరిస్తే పిల్లలకు కూడా అలవాటు అవుతుంది ఎందుకు ధరించాలి అని పిల్లలు అడిగితె చెప్ప గలగాలి ఆ స్థలములో ఆజ్ఞా చక్రం ఉంటుంది అది అగ్ని స్థానం శక్తి ప్రసరించే స్థానం ఆ శక్తి ని కొంచెం చల్ల బరిచేందుకు అచ్చట కుంకుమ తో కప్పటం చాల ప్రయోజనం అని చెప్పా గలగాలి