Wednesday, February 25, 2015

తుంటరి పలకరింపు

చెలీ!
నీ జ్ణాపకాలలో ఉంటున్నా ప్రతిక్షణం
కనిపిస్తున్నావు నీవు క్రొత్తగా అనుదినం
సంధ్యాసమయన పచ్చికపై నీకై నా ఎదురుచూపు
వీచే గాలి నీ చెలీ రాదా అని తుంటరి పలకరింపు
నా చుట్టూ అల్లుకున్న నీ తీపిగుర్తులు నీవైపు లాగుతున్నాయి
నడిరాతిరిలో నీ ఆలోచనలు వెన్నెలను పంచుతున్నాయి
మనసు చాటున మునుపెన్నడూ లేని కోరికలు
నీతో చెప్పలేక అవుతున్నా తనమునకలు
నా కనులు చూసి అయినా కనుగోనలేవా చెలీ....!

Sunday, February 22, 2015

ఒక మగాడు ఏడ్చేదెప్పుడో తెలుసా

ఈ ప్రపంచంలోకెల్లా ఘోరమైన
శిక్ష ఏంటో చెప్పనా
మనం ఇష్టపడ్డ వ్యక్తి మనకి
దూరం కావటమే ,
అందులోనూ ప్రేమించిన
అమ్మాయి
...
నువ్వంటే
నాకు ఇష్టం లేదు ,
నన్ను మర్చిపో
అన్నప్పుడు మాటలు రాక
నిలబడతాడు
...
అప్పుడు , ఆ
నిమిషం మనసులో కలిగే
బాధుందే
అది చావుకన్నా దారుణమైంది
...
అలాంటి శిక్ష
నువ్వు నాకు వేసావ్
....
ఈ లోకంలో ప్రేమకన్నా
సంతోషాన్నిచ్చేది ఏదీ లేదు
అలాగే బాధనిచ్చేదీ ఏదీ లేదు
...
ఒక మగాడు ఏడ్చేదెప్పుడో
తెలుసా
ప్రేమించిన అమ్మాయి
దూరమైనప్పుడు

నీవైపే నా పాదాలు

ప్రియా!
నీ పరిచయంతో మనసంతా మధుమాసం
నీ స్నేహంతో జగమంతా క్రొత్తదనం
ప్రతినిమిషం నీ తీయని మాటలు నా చుట్టూ
మదిలో నీ ఆలోచనలే కలవరపెడుతున్నవి ఒట్టు
నీ జ్ణాపకాలు నిదురపోనియ్యకున్నవి
నీవైపే నా పాదాలు పరుగులుపెడుతున్నవి
నా ఆశలు నీ జతకై ఎదురుచూస్తున్నవి
చిలిపి ఊహలు నీ దరి....చేరుకోమంటున్నవి!నీలో నేనున్నానో లేదో

నీ నువ్వు తెలుసు..........నీ మనసు తెలుసు
నీ చూపు తెలుసు.....నీ మాట తెలుసు
నీ నవ్వు తెలుసు......నీ మౌనం తెలుసు
నీ అలోచన తెలుసు..నీ ఆవేశం తెలుసు
నీ ఇష్టం తెలుసు.....నీ కష్టం తెలుసు...
నీ గురించి ఇన్ని తెలిసిన నాకు,
నీలో నేనున్నానో లేదో...నాకింకా తెలియదు..
నీవంటే నాకున్నది ప్రేమో,ఆరాధనో,ఇష్టమో,కోరికో..
నాకు తెలియక నీన్ను అడుగుదామని వస్తే!
ఏమిటీ ఎదో అడగాలనుకుంటున్నావ్?
అన్న ప్రశ్న నీ నుండి..
అడగాలని వున్నా..
అడగలేక సందిగ్ధావస్థలో నేను.. .
ఎలానో నోరు తెరిచి అడిగా...
నాపై నీకున్నదీ,నీపై నాకున్నదీ ఏమిటి?..అని...
సూటిగా తగిలిన నీ చూపు తాళలేక..
వాలిన కనులను నీవైపు తిప్పుకుంటూ..
ఎక్కడనుండి ఏమని చెప్పను? ఐనా చెబుతా విను అంటూ...
నా పెదవి దాటి మాట రాకముందే నా అలోచన నీకెలా తెలుస్తుందీ?
నా మీదున్నది ప్రేమ కాకపోతే నా కోపాన్నెందుకు భరిస్తావ్?
నీమీద నాకున్నది అనురాగం కాకపోతే నీ మౌనంలోని భావం నాకెలా చేరుతుందీ?
నేను నవ్వితే నీ కళ్ళు వేవేల కాంతులీనుతాయి.ఇది ఇష్టం కాదా..
నా కళ్ళలో బాధకి నీ మనసు విలవిలలాడుతుంది.. ఇది ఆరాధన కాదా...
అంటూ నా వైపు వేసే నీ అడుగులనే చూస్తూ..
మనసులో వున్న మబ్బులన్నీ వీడి పున్నమిచంద్రునిలా నిన్ను చూసి లయ తప్పిన గుండె చిక్కబట్టుకుని
ప్రేమ కలిగిన ఇష్టంతో అనురాగం పంచిన ఆ మనుసుని ఆరాధనతో చూస్తూ..
ఒక్కో అడుగుకీ నాకు దగ్గరవుతున్న నిన్ను చూస్తూ
మనసు నిండా వున్న ప్రేమని తెలియచెప్పాలని చూస్తున్నా...

Wednesday, February 18, 2015

స్వర్గమంటే తెలియదు


ప్రేమంటే నువ్వే అని తెలిసింది
నీతో గడిపిన క్షణాలలో..,
స్వర్గమంటే తెలియదు కానీ
అది పంచే హాయిని చూశాను నీ చెలిమిలో...,
దూరమైనా దగ్గరగా ఉన్నాను
ప్రేమ నిండిన నీ హృదయంలో..,
నరకానికి అర్థం తెలియదు కానీ
అందులో ఉండే బాధను చూశాను నీ ఎడబాటులో...,
కలలు కనడం తెలిసినా గానీ
అందులోని కమ్మదనాన్ని చూశాను నీ సాన్నిహిత్యంలో..,
పదములు ఎన్నో వ్రాశానుగానీ
అవి కవితలా మారడం చూశాను
నీ తలపు తాకిన నాలో...!!

Monday, February 16, 2015

నీ గుండె గూటిలో

స్వచ్ఛమైన మనసుతో చేరువయ్యావు..,
నీ గుండె గూటిలో నన్నే కొలువుంచావు..,
నా గుండెలో యద చప్పుడు నువ్వు..,
నిజమైన ప్రేమకు అర్థం నువ్వు..,
ప్రతి నిమిషం నాతో ఉన్నాననిపిస్తావు.,
మరుజన్మలో కూడా మరువలేని ప్రేమనందించావు..,
ప్రతి ప్రేమకవితకు ప్రాణం పోస్తున్నావు..,
నా ప్రాణం నువ్వైపోయావు..


రెప్పమూస్తే నీవు

చెలీ!
కనురెప్పలు మూతపడనంటున్నవి
రెప్పమూస్తే నీవు కనుమరుగఔతావని
ప్రతిక్షణం మన తొలివలపు తీయని జ్ణాపకాలలో వెలిగిపోయా
ప్రతిపూట నీ తలపులలో పగలు రేయి మరిచిపోయా
కలలు రోజూ అలలులా అలజడి చేస్తున్నాయి మనసున
నీతో పంచుకున్న ప్రణయాలు నిండెను నా హృదయాన
నీ రూపాన్ని దేవతగా ప్రతిష్టిoచా గుండెలోనా
నీవు ఎపుడు నాతో ఉంటే రోజూ పండగే నా జీవితాన!