Saturday, November 29, 2014

గుండెపై కోతలే

శిలలుగా మారెనా చెలీ మన మనసులూ
ఊహలే కూలినా తడవవేం కన్నులూ
ఉప్పెనే దాచనా కంటిపై రెప్పలూ
గుండెపై కోతలే చిన్ని నిట్టూర్పులూ
నిన్న స్వప్నాలు నేడు శిధిలాలు
గుండె శకలాలు మిగిలెనే
ప్రేమ చిగురించి పూలు పూశాక
పాడు శిశిరాలు కమ్మెనే
ఒక మాటలేక మూగబోయె గొంతులు

నీ అలోచనల మంటను


చెలీ!
నాపై నీ ప్రేమను ధారగా నువు కురిపించావు
ఆపై నీ అలోచనల మంటను నాలో రగిలించావు
నీ చూపులతో నాపై పూల బాణం వేసేసావు
నా మదిలో ప్రేమ రాగాలు నువు పలికించావు
తొలి పొద్దున సూర్య కిరణంలా నను పలుకరిస్తావు
పండు వెన్నెలలో నా కవితకు ప్రేరణ అవుతావు
నీ చెలిమి కోసం ప్రతి క్షణం తపిస్తున్నాను
నీతో ఈ బంధం కలకాలం ఉండాలని కోరుకొంటున్నాను............

Tuesday, November 25, 2014

నువు దగ్గరలేనప్పుడు

చిరుగాలికి కదిలే నీ కురులను తాకుతూ
పరవసించి పోతుంటాను
నీ చూపులు పలికే భావాలకు
ఏవేవో అర్ధాలు రాసేసుకుంటాను
నిన్ను కలిసినప్పుడు మాటలు మర్చిపోయి
మౌనంతో గొడవ పడుతుంటాను
నువు దగ్గరలేనప్పుడు
నీతో చెప్పాలనుకున్న మాటలతో
స్నేహం చేస్తుంటాను
నువ్వు కనిపించినప్పుడు
చూస్తూ ఉండిపోతాను
నువు కనిపించనప్పుడు
ఊహల్లో నిన్ను చూస్తుంటాను
ఎప్పుడూ నీతోనే గడిపేసున్నాను
నీలో నేనున్నా లేకున్నా
నాలో కలకాలం నీతో కలిసే ఉంటాను.

Saturday, November 22, 2014

అల్లరి చేసే చిలిపి చిరుగాలి

చల్లగా కాసే ఓ వెన్నెలమ్మ
నా మనసెంటో నా చెలికి విన్నవించు
అల్లరి చేసే చిలిపి చిరుగాలి
నా కోరికలే ఆమెకు విన్నవించు
మకరందం చిందించే నీ అధరాలు సాక్షి
నీ సిగలో దాగున్న మరుమల్లెలు సాక్షి
నీ కౌగిలిలో బందీనై చలిరాతిరి పోయేదాక
తెలతెలవారే దాకా హద్దులు చేరిపేసి
ముద్దులు కలబోసి అల్లుకున్న అందమైన
ఈ రేయి జ్ణాపకం మరువలేని అనుభవం.......

Wednesday, November 19, 2014

నీ శ్వాసగా నే ఉన్నా

చెలీ!
నీ కనుపాపలో నా రూపం ఉంటుందనుకున్నా
నీ ఆలోచనలలో నా జ్ణాపకం చెదిరిపోదనుకున్నా
నీ అధరాలు నిత్యం నా పేరు పలుకుతాయనుకున్నా
నీ శ్వాసగా నే ఉన్నాననుకున్నా
నీ ప్రతిపనిలో నీకు తోడుగా నను ఉంచవనుకున్నా
నీ మనసులో నాకు స్థానాన్ని ఇచ్చావనుకున్నా
నీ ప్రేమను నాకు నిజంగా పంచవనుకున్నా
నీ హృదయంలో నే ఉన్నాననుకున్నా
అంతా నా భ్రమ అని తెల్సి....శూన్యంగా మిగిలున్నా.

Monday, November 17, 2014

నీ ముందు నే ఓడిపోయా

చెలీ!
నువు గుర్తొస్తున్న ప్రతి నిమిషం
నా చుట్టూ నీ జ్ణాపకాలు తిరుగుతూ
నా ఆలోచనలకు చెబుతున్నాయి
నీ ముందు నే ఓడిపోయానని
ఓసారి నీ హృదయం అంటావు
మరు నిమిషం మన మధ్య ఏమి లేదంటావు
ఒకసారి మనసులోకి వచ్చాక
ఒకరికి ఒకరిగా కలిసిపోయాక
ఉండాలి ఆ బంధం చివరి శ్వాస వరకు
కానీ ఇపుడు నాకు మిగిలింది
ఒంటరితనం ,కన్నీటి ప్రవాహం..........

Friday, November 14, 2014

నీ చెలిమి లేని జీవితం

జీవితమే ఒక విషాద నిలయం
ఈ బ్రతుకే ఒక లోతైన వలయం
నీ చెలిమి లేని జీవితం గాఢాంధకారం
నీ పలుకు వినని క్షణం నా చుట్టూ శూన్యం
నీ పిలుపు లేని దినం నను కమ్ముకుంది ఒంటరితనం
నీవు దూరమవుతావన్న ఈ నిమిషం
నా మనసునిండా ప్రవహిస్తున్నది కన్నీటి ప్రవాహం
నా గుండె గుడిలో పదిలంగా ఉన్నది నీ రూపం
నీ జ్ణాపకాలతో బ్రతికేస్తా.....నా ఊపిరి ఉన్నంతకాలం.

మరువలేని జ్ణాపకాలను

చెలీ!
ఊహాలే నా ప్రపంచంగా బ్రతికిన నాకు
నీ ప్రేమతో మరువలేని జ్ణాపకాలను మిగిల్చావు
నా మదిలో ఉప్పెనలా నీ ఆలోచనలు వస్తుంటే
నిలువరించలేని నా హృదయం మౌనంగా చూస్తుంటే
కునుకురాని నా కన్నులు నీ జాడకోసం వెతుకుతూవుంటే
అధరాలు నీ పేరును పదేపదే పలుకుతూవుంటే
నీ గుండెలో నే లేనని తెల్సి ....నువు నా దరి రావని తెల్సి
మరలా నే చూస్తున్నా..............నా ఊహలకేసి