Sunday, April 26, 2015

ఓ క్షణం కళ్ళు మూసుకుంటే

నా మదిలో గుట్టుగా దాచిపెట్టిన గుప్పెడు ఊహలు స్వేచ్ఛగా గువ్వల్లా ఎగరాలనిఉవ్విళ్లూరుతున్నాయి..
ఓ క్షణం కళ్ళు మూసుకుంటే రెప్పల మాటున రోజు గడిచినట్టుంది..

గోడకున్న కుందేలు గడియారం చెవులు పట్టుకు ఎంత లాగినా ఒక్క ఘడియా కదలదే!
ఒక్కో సూర్యోదయం కోసం ఎన్నెన్ని అహోరాత్రాలు వేచి చూశానో కదా!

అలా కొన్ని యుగాల నిరీక్షణ అనంతరం నా తపస్సు ఫలించి నా కళ్ళ ముందు నువ్వు అవతరించావు..
నీ సాక్షాత్కారానికి అచ్చెరువొంది నే రెప్పవేయడం మరచి చూస్తుండిపోయాను..

అంతదాకా పోగేసిన నా ఊహలన్నీ నీ సమక్షంలో ఊసులుగా మారకుండానే మూగబోయాయి..
నీ మనోహర రూపం నా కళ్ళల్లో నింపుకుందామన్న పిచ్చి ప్రయత్నంలో ఘడియొక క్షణంలాకరిగిపోయింది..

నీ కంటిపాప వెలుగులో నా ప్రతిబింబం చూసుకుంటూ హృదయ నివేదనం చేసేలోపే రెప్పపాటులో అంతర్దానమయ్యావు..
ఆ మధురక్షణాల ముత్యాలసరాన్ని భద్రంగా దోసిట్లో పట్టుకుందామనుకుంటుండగానే చేజారి చెల్లాచెదురై పోయింది..
సప్తవర్ణరంజితమైన స్వప్నమొకటి రంగులన్నీ వెలిసిపోయి బోసిగా మిగిలిపోయింది!Wednesday, April 22, 2015

నిశ్శబ్ధ రాగంలో ..

ఓకవిత రాయాలని వుంది
నీ ఒడిలో తలపెట్టి
మెరిసే ఆ కన్నులు పూయించే
వెన్నెలను ఆస్వాదిస్తూ..
పెదాలపై విరిసిన అరనవ్వును మీటుతూ..
కెంపులయిన చెంపలపై
గారాలు పోతూ గాలికెగురుతున్న ముంగురులను చూస్తూ...

ఓ కవిత రాయాలనుంది
నిశ్శబ్ధ రాగంలో ..
మనసు కోయిల పాడే పాటను
నీ మృదు మధుర పదాలలో వినాలనీ..
గుండె గొంతుక దాటి రాని
మాటలన్నీ నీ మౌనంలోనే వింటూ..
ఈ గుప్పెడు గుండెకు ప్రాణం పోసే ఆగుండె సవ్వడి వింటూ ..

ఓ కవిత రాయాలని వుంది

ప్రతీ నిమిషం నువ్వు

ప్రతీక్షణం నువ్వు నన్ను చూస్తూ ఉండక పోవచ్చు ...?
ప్రతీ నిమిషం నువ్వు నాతో మాట్లాడకపోవచ్చు ...?
కానీ...!
నీ ప్రతీ ఆలోచనలో నేనుంటానని...
నీ గుండె చేసే ప్రతీ స్పందనలో,
నా పేరువినపడుతుందని...
నువ్వు తీసుకునే ప్రతీ శ్వాసలో,
నీ ఊపిరి నేనే అని నాకు తెలుసు...!!
అందుకే అందరాని దూరంలో నువ్వున్నా...!
అందకుండా పోతావనే ఆలోచన నాకు రాదు....!!
ఎందుకంటే ...!!
అందమైన మన ప్రేమ పందిరిలో,
నన్ను అల్లుకుపోయిన మల్లె తీగవు నీవు.!!
ఏడుజన్మలెత్తినా...!
ప్రతీ జన్మలో నన్నంటిపెట్టుకు తిరిగే,
ఏడేడు జన్మల సంబంధానివి నీవు...! 

Friday, April 10, 2015

నా మనసుని దోచి

నీ ఇంటి దీపం నేనన్నావు ...
నా హ్రుదయాన్ని మంటలతో ముంచెసావు...
నీ ఊపిరి నేనన్నావు ...
నా మనసుని దోచి ఒంటరిగ గెంటేశావు ..
నీ గుండె లయ నేనన్నావు..

నడి సముద్రంలో నావాలా ఒదిలేశావు...
నీ కంటి చూపు నేనన్నావు..
నన్ను ఎదురు చూపులకు బలి చేశావు......!!!

Friday, April 3, 2015

నా ప్రాణం నువ్వైపోయేవేళ

నేనే లేని లోకం నాది . . ,
నాకే తెలియని కలలే నావి . . . !

నా ప్రాణం నువ్వైపోయేవేళ . ,
నన్ను పిలిచే పిలుపు నీదే . . ,
నేను తలచే పలుకు నీదే . . . !

నన్ను నేనే మరిచే వేళ . ,
చూసే ప్రతీ చోట నువ్వే . . ,
నడిచే ప్రతీ బాటా నీ జ్ఞాపకమే . . . !

నువ్వు లేని ఈ ఒంటరి వేళ . .