పెళ్ళిళ్ళకి, శుభకార్యములకు మామిడి తోరణాలు కడతారు. ఎందుకు?
ఎందుకంటే పెళ్ళిళ్ళు, శుభకార్యములు జరిగినపుడు ఆ ప్రదేశంలో ఎక్కువ మంది మనుషులు ఒక చోట చేరుతారు.మనుషులు అందరూ గాలిలో ఉన్న ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డై ఆక్సైడ్ వదులుతుంటారు. కాబట్టి శుభకార్యములు జరిగినప్పుడు గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. అటువంటప్పుడు గాలిలొ ఆక్సిజన్ పెంచడానికి మామిడి తోరణాలు, తాటాకు పందిళ్ళు, అరటి చెట్లతో మండపాలు వంటివి ఏర్పాటు చేస్తారు. ఆకుపచ్చని మొక్కలు అన్ని గాలిలొ ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతుంటాయి. అందుకని పెళ్ళిళ్ళకి, శుభకార్యములకు మామిడి తోరణాలు కడతారు.
9 comments:
ఇది genuine అనుమానం. ఆకులు చెట్ల నుండి వేరయ్యాక కూడా photosynthesis చేస్తాయా?
చేయవు. వేరు చేయనప్పుడు కూడా అవి ఎండ పడేప్పుడు కిరణజన్య సంయోగక్రియ జెరిగేప్పుడు మాత్రమే ఆక్సిజన్ విడుదల చేస్తాయి. నిజానికి అవి రాత్రిపూటల్లో కార్బన్ డై ఆక్సైడ్ విడుదల చేస్తాయి.
ఇలా బలవంతపు కారణాలు వెతుక్కునేకంటే, అవి ఆకుపచ్చగా కంటికి ఇంపుగా ఉంటాయని చెప్పుకోవటం సముచితంగా ఉంటుంది.
పచ్చదనం కంటికి ఇంపుగా వుండి మనసుకి అహ్లాదన్ని కలిగిస్తుంది. ఎరుపు రంగు భిభత్సానికి చిహ్నమైతే, ఆకుపచ్చ శాంతికి చిహ్నం. అంతకన్న ఇంకేమి నిఘుడార్ధాలు లేవని నా అభిప్రాయం.
అన్నలారా
అలాంటప్పుడు మామిడకులే దెనికి? బెండ, దొండ, కాకర, చిక్కుడు ఆకులు కట్టొచు కదా? మామిడి ఆకులకి ఏదో ఒక ప్రత్యేకత ఉంది. కనుక్కుంటా!! ఛేదిస్తా!! ఉంటా
భాస్కరు
మంచి చర్చ.సమాధానం కోసం నేనూ ఎదురుచూస్తున్నాను.
కిరనజన్య సం యోగ క్రియకు సూర్య రశ్మి, పత్రహరితము, నీరు అవసరము.ఈ మూడు వుంటే (ఫోటోసింతసిస్ జరుగుతుంది.మామిడి ఆకుల తోరణాలు కడితే కళ్ళకు ఆహ్లాదకరంగా పచ్చగా వుంటుంది కాని కేవలం ఆక్సిజన్ కొసం మాత్రం కాదు.రెండవది.ఇది హిందూ సాంప్రదాయం
జాబాలిముని
కొన్ని సంప్రదాయాలకి అర్ధాలు వెతకటం తప్పులేదు కాని ప్రతిదాని వెనక శాస్త్రీయత ఉందని అనుకోవటం సరికాదు.మామిడి ఆకుల తోరణా నికి ఆక్సిజన్ కి ముడి పెట్టటం హాస్యాస్పదంగా ఉంది.సంప్రదాయాలని చిన్న చూపు చూడకూడదు కాని లేనిపోని ప్రాముఖ్యతని ఆపాదించటం సమంజసంగా లేదు.
"ఆకులు చెట్ల నుండి వేరయ్యాక కూడా photosynthesis చేస్తాయా?" -కోసిన ఆకు ఎండిపోతుంది అంటే అర్ధం ఏంటీ? కిరణజన్య సమ్యోగ క్రియ జరగడమ్లేదు అనేకదా.
నేను ఈ రహస్యాన్ని ఛేదించటానికి ప్రయత్నించా కాని, ఇంకొంత సమయం పట్టేలా ఉంది. మామిది ఆకుల వాసన మనలో పండుగ (శుభకార్యం) ఉత్సాహాన్ని పెంచుతుందేమో?
మామిడాకులు, తాటాకులు వంటివి వాడడానికి కారణం. మామిడాకులు, తాటాకులు వంటివి త్వరగా వాడిపోవు మరియు ఎండిపోవు.వాటిలో పత్రహరితం ఎక్కువకాలం నిలిచివుంటుంది. పత్రహరితం నిలిచివున్న అన్నినాళ్ళు కిరణ జన్య సం యోగక్రియ జరుగుతుందని నా అభిప్రాయం. అందుకే వాటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.
Post a Comment