Friday, June 29, 2007

మీరు ఎప్పుడైనా సింగినాదం జీలకర్ర అనే సామెత విన్నారా? దీనివెనుక చిన్నకధ వుందండీ

సింగినాదం జీలకర్ర అనే సామెత సాధారణంగా ఏదైనా ఒక విషయాన్ని గురించి బాగా గొప్పగా చెప్పి, అక్కడ ఆ విషయం అనుకున్నంత గొప్పగా లేకపోతే ఆ విషయం గురించి విన్నవారు ఆ ఏముంది సింగినాదం జీలకర్ర అనడం పరిపాటి అయిపోయింది.అయితే ఈ సింగినాదం జీలకర్ర అనేది దాని అసలు రూపం అది కాదండీ. శృంగనాదం జీలకర్ర నుండి వచ్చినదే ఈ సింగినాదం జీలకర్ర. దీని వెనుక వున్న అసలు విషయం ఏమిటంటే. పూర్వకాలం బందిపోటు దొంగలు గ్రామాలపై బడి విచ్చలవిడిగా దోపిడీలు, దొంగతనాలు చేస్తుండేవారు. వీరు ఇలా గ్రామాలపై దాడికి వచ్చినపుడు శృంగమనే వాయిద్యాన్ని ఊదుకుంటూ వచ్చే వారు. దాంతో శృంగమనే వాయిద్యం శబ్దం వినగానే ప్రజలందరూ భయ బ్రాంతులతో పారిపోయేవారు. అలాంటి పరిస్థితులలో ఒకానొకరోజు కొంతమంది జీలకర్ర వ్యాపారస్తులు జీలకర్ర అమ్మడానికి గ్రామానికి వచ్చారంట. ఇప్పటికీ మన గ్రామాలలొ ఏదైనా విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయాలంటే చాటింపు ద్వారా తెలియ చేస్తారు. అలాగే జీలకర్ర వ్యాపారస్తులు కూడా జీలకర్ర అమ్ముతామంటూ ఈ శృంగము ఊదుతూ తిరిగారంటా.ఈ శృంగము యొక్క శబ్దం వినగానే ప్రజలందరూ భయ బ్రాంతులతో పారిపోయారంట. కాని ఎంతసేపటికీ ఎటువంటి అలజడి లేకపోవడంతో జనమంతా మెల్లగా బయటికి వచ్చి చూస్తే జీలకర్ర వర్తకులు. అరే శృంగనాదం బందిపోటు దొంగలది కాదు జీలకర్ర వర్తకులది. మనం అనవసరంగా భయపడ్డాం అని ఊపిరి పీల్చుకున్నారంట. అప్పటినుండి లేనివిషయానికి అనవసరంగా రాద్దంతం చేస్తే ఏముంది శృంగనాదం జీలకర్ర అనడం పరిపాటి అయ్యింది. అదే రానురానూ సింగినాదం జీలకర్ర అయ్యింది.

7 comments:

రానారె said...

బాగుంది చందమామ కథలాగా. మీ బ్లాగులో అక్షరాల రంగూ సైజూ... అంత చదవబుల్‌గా లేదండి.

రాధిక said...
This comment has been removed by the author.
రాధిక said...

మీ బ్లాగు ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటున్నాను

rākeśvara said...

బాగుంది కథ.
మీరు అక్షరాల రంగు పసుపు నుండి వెనక్కి మారిస్తే ఇంకా బాగుంటుంది బ్లాగు.

Naga said...

చిన్నప్పుడు బాగా వినేవాడిని మళ్ళీ గుర్తు తెచ్చారు. కథ మాత్రం మొట్టమొదటి సారి వింటున్నాను... థాంక్స్

బ్లాగేశ్వరుడు said...

నాకో చిన్న సందేహం, మీరు వ్రాసిన దాని గురించి (సింగినాధం జీలకర్ర) గురించి ఇంకొ విధంగా విన్నాను , పూర్వం మన దేశం లొ జీరకరా దొరికేది కాదుట అందుకని విదేశాలనుంది ఎగుమతి చేసుకొనే వారమని, సముద్ర తీరం లొ ఉండేవారికి వారి తీరాలకు నౌకలు వచ్చినప్పుడు పెద్ద శృంగనాధం (శంఖాన్ని పూరించేవారని) అప్పుడు జీలకర్ర కావలసిన వారు వచ్చి కొనుక్కొనేవారని విన్నాను, అప్పటినుంది, శృంగనాధం అంటే జీలకర్ర వచ్చినట్లు, అదే కాలక్రంఅగా సింగినాదం జీల కర్ర అయ్యిందని విన్నాను. నా దగ్గర ఏమి ఋజువులు లేవు చూపించడానికి, ఏమైన మంచి సమాచారం, బాగుంది మీ బ్లాగు, మాటలబాబు మాటలు ( నా బ్లాగు) వద్దకు కూడా వచ్చి ఒక మాట వ్రాయండి. -- మాటలబాబు

Nalluri said...

chala baga cheparu... mee blog kuda super vundi... me blog lo members la join avadam ela ???