స్త్రీలు బహిస్టు కాలము (మెన్సెస్) మూడు రోజులు అందరిలో కలియకుండా ప్రత్యేకముగా వుండేవారు.గృహకృత్యాలలొ పాల్గొనేవారు కాదు,విశ్రాంతి తీసుకొనేవారు.దీని వెనుక గల శాస్త్రీయ కారణము యేమై వుండవచ్చు? జాబాలిముని
అని ప్రశ్నించారు. ఇది చాలా సున్నితమైన మరియు స్త్రీల సమస్య. ఇలాంటి వాటిపై వివరణ స్త్రీలు లేదా డాక్టర్స్ అయితే సరిగా ఇవ్వగలరు. నా ఆలోచనా పరిధిలో ఈ బహిస్టు సమయములో స్త్రీలలో ఎక్కువగ రక్త స్రావం జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో వారు చాలా నీరసంగా వుంటారు. అలాంటి పరిస్థితులలో ఇంటిపని, వంటపని అంటూ పనులన్నీ చేస్తుంటే వారు ఇంకా నీరసించి పోతారు. ఆ సమయంలో వారికి విశ్రాంతి అవసరం. అలాగే రక్తస్రావం వలన బ్యాక్టీరియా ఇంఫెక్షన్ వచ్చే అవకాసం వుంది. కనుకనే బహిస్టు సమయము మూడు రోజులూ అన్ని రకములైన పనులకూ దూరంగా వుండమంటారు. ఆ సమయంలొ బలవర్ధకమైన ఆహారం మరియు పళ్ళరసాలు తీసుకొంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ పనులు మీరు సక్రమంగా చేసుకొవచ్చు. నా అభిప్రాయం తప్పయితే మన్నించగలరు. సహ్రుదయంతో మీ అభిప్రాయాలను పోస్ట్ చేస్తారని ఆశిస్తూ...
1 comment:
ఆ సమయంలో వారు వివిధరకాలైన శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు(నొప్పి,చిరాకు ఇతరత్రా). ఇలాంటి సమయంలో వారికి ఇంటిపని నుంచి విశ్రాంతి కల్పించే మంచి ఉద్దేశ్యంతో ఈ ఆచారం మొదలైంది అనుకుంటా.
Post a Comment