Wednesday, July 18, 2007

మీరు ఎప్పుడయినా గుడి చుట్టూ మూడు సార్లు తిరిగారా? పోనీ గుడిలోకి వెళ్ళి వచ్చి గుడి మెట్లపై కూర్చున్నారా?

మన పెద్దలు మనము ఎప్పుడయినా గుడికి వెళ్ళితే, గుడిలోకి వెళ్ళే ముందు,గుడి చుట్టూ మూడు సార్లు తిరిగామంటారు.అలాగే గుడిలోకి వెళ్ళి దైవ దర్శనం పూర్తి అయిన తరవాత వచ్చి గుడి మెట్లపై కూర్చోమంటారు. ఈ ఆచారం ఎందుకొరకు పెట్టారో తెలుసా? మన పూర్వీకుల కాలంలో శృంగార పరిజ్ఞానం ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నంతగా లేదు. ఇప్పుడు కాలంలో యువత సిడీల ద్వారాను, టివీల ద్వారాను, పుస్తకాల ద్వారానూ శృంగార పరిజ్ఞానం సంపాదిస్తున్నారు. అయితే ఆ కాలంలో శృంగారం గురించి తెలియాలంటే కామ శాస్త్రం చదవాల్సి వుండేది. అయితే అది కేవలం ఉన్నత శ్రేణి వారు లేదా పండితులకు మాత్రమే అర్ధమయ్యే భాషలో ఉండేది. అయితే ఆ కాలంలో స్త్రీలు గడప దాటి బయటకు వచ్చే వారు కాదు. సామన్యులకు సైతం ఈ కామశాస్త్రాన్ని అందుబాటులోనికి తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో, ఈ శాస్త్రాన్ని శిల్పకళగా మలచి అందరూ చూసే అవకాశముండునట్లుగా దేవాలయాలపై నిలిపే వారు. కాబట్టి గుడికి వచ్చే భక్తులందరూ వీటిని దర్శించే ఉద్దేశ్యంతో గుడిలోకి వెళ్ళే ముందు,గుడి చుట్టూ మూడు సార్లు తిరిగామన్నారు. అలాగే గాలి గోపురాలపై ఉండే విగ్రహాలను చూడడానికి వీలుగా గుడిలోకి వెళ్ళి దైవ దర్శనం పూర్తి అయిన తరవాత వచ్చి గుడి మెట్లపై కూర్చోమంటారు. అయితే కొందరు ఈ ఉద్దేశ్యాన్ని గుర్తించలేక అలా తిరిగేటప్పుడు కళ్ళు మూసుకుంటారు. అయితే ఇప్పుడు ఆ శిల్పకళా లేదు. వాటి అవసరమూ కనిపించడం లేదు. అంతగా అభివృద్ది చెందింది మన యువత.

5 comments:

Bhãskar Rãmarãju said...

అన్నా
నిజమే అంటావా? ఎందుకో నమ్మ బుధి కావటమ్లేదు.
మళ్ళి ఒకసారి కనుక్కో అన్నా. ఎన్ని గుళ్ళాలో శృంగారాన్ని తెలిపే విగ్రహాలు ఉన్నయీ? మా గుళ్ళో ఐతే లేవు. అని చెప్పి మా గుళ్ళు ఏకొత్తవో కావు. ఒక 2000-3000 సంవత్సరాల చరిత్ర ఉంది మా గుళ్ళకి (మా ఊళ్ళోది మరియూ చుట్టుపక్కల ఊళ్ళలోని గుళ్ళకి).

Sitaram Vanapalli@9848315198 said...

తెలుసుకున్నానండి, ఈ శిల్పకళ ఎక్కువగా చోళరాజుల కాలం లోనిది.

Naga said...

ఇంత scene ఉంటుందనుకో లేదు. ఒకటి రెండు గుడి ముందున్న గోపురాలని చూసి ఖంగు తిన్న మాట నిజం!

Naga Pochiraju said...

అయ్యా...గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాం.
దీని వెనుక ఉన్న ఉద్దేశం కృతఙ్ఞత.
మొదటి ప్రదక్షిణ ఆ గుడి కి
రెండవది ఆ శిల్పికి
మూడవది ఆ దేవుడికి

ఇది వరకు గుళ్ళు ముఖ్యం గా కోసం communications
కాసేపు కూర్చోవడం వల్ల కొత్త వారితో పరిచయం ఏర్పడె అవకాశం ఉంటుంది అని.
ఇది వరకు గుళ్ళల్లో హరికథలు మొదలగు వాటి ప్రదర్శన ద్వారా ప్రజలకు ఎన్నో విషయాలు చెప్పేవారు

ఇక ఈ కామ శాస్త్రానికి వస్తే...

ధర్మ,అర్ధ,కామ,మోక్షం .......
ఇదే తీరుగా గుడి నిర్మాణం .
ఆ శిల్పాల తీరు గమనిస్తే ఇదే వరుస లో ఉంటాయి

మోక్షానికి చిహ్నం గా గుడి మీది గోపురం ఉంటుంది.అంటే మోక్షం అనంతమైనది అని అర్ధం

Sitaram Vanapalli@9848315198 said...

మీ విశ్లేషణ బావుందండీ