Tuesday, July 3, 2007

మనము బస్సును చూడగానే అది ఎక్స్ ప్రెస్స్ లేదా ప్యాసింజెర్ బస్సు లేదా పాస్ట్ ప్యాసింజెర్ అనేది వెంటనే తెలుసుకోవచ్చా?

మనము బస్సును చూడగానే అది ఎక్స్ ప్రెస్స్ లేదా ప్యాసింజెర్ బస్సు లేదా పాస్ట్ ప్యాసింజెర్ అనేది వెంటనే తెలుసుకోవచ్చు. అసలు ఆర్.టి.సి. బస్సులలో ఉన్న ముఖ్యమైన రకాలు మూడు.(హైదరాబాదు లాంటి నగరాలలో కాదు). అవి 1. ప్యాసింజెర్ బస్సు, 2. ఎక్స్ ప్రెస్స్, 3. పాస్ట్ ప్యాసింజెర్ బస్సులు.ప్యాసింజెర్ బస్సు ఎక్కువ స్టేజ్ లలో ఆగుతుంది మరియు టికెట్ చార్జీలు కూడా తక్కువ. అదే ఎక్స్ ప్రెస్స్ అయితే తక్కువ లేదా మెయిన్ స్టేజ్ లలో మాత్రమే ఆగుతుంది. టికెట్ చార్జీలు కూడా ఎక్కువ.ఇక పాస్ట్ ప్యాసింజెర్ అయితే తక్కువ లేదా మెయిన్ స్టేజ్ లలో ఆగుతుంది మరియు టికెట్ చార్జీలు తక్కువ. మనకు ఎర్రబస్సు అయితే ప్యాసింజెర్ అని, ఆకుపచ్చ బస్సు అయితే ఎక్స్ ప్రెస్స్ అని తెలుసుకొనేవారము. అయితే ఆర్.టి.సి. వారు అపుడపుడు బస్సులను వారికి వీలుగా ఏ బస్సులు కావాలనుకుంటే ఆ బస్సులను ఉపయోగిస్తున్నారు. అలాంటప్పుడు ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టీ ఒక బస్సును చూడగానే అది ప్యాసింజెర్ బస్సా లేక ఎక్స్ ప్రెస్సా లేక పాస్ట్ ప్యాసింజెరా అనేది దానికి తగిలించిన బోర్డును బట్టి తెలుసుకోవచ్చు. నల్లటి అక్షరాలు ఉంటే అది ప్యాసింజెర్,ఎర్రటి అక్షరాలు ఉంటే అది ఎక్స్ ప్రెస్స్, అదే పచ్చటి అక్షరాలు ఉంటే అది పాస్ట్ ప్యాసింజెర్.

1 comment:

రాధిక said...

చాలా ఉపయోగకరమయిన టపా.మేము చదువుకునే రోజుల్లో ఏది ఏబస్సో తెలీక చాలాసార్లు ఇబ్బంది పడేవాళ్ళం.తరువాత కొన్నాళ్ళకి ఇలానే ఏవో కొన్ని గుర్తులు సంపాదించాములెండి.