Wednesday, July 11, 2007
నిప్పుల గుండంలో నడిస్తే కాళ్ళు కాలతాయా?
నిప్పుల గుండంలో నడిస్తే కాళ్ళు కాలతాయా? నిప్పుల గుండంలో నడవడమనేది అటు హిందూ సాంప్రదాయంలోనూ, ఇటు మహమ్మదీయ సాంప్రదాయంలోనూ మనకు కనిపిస్తుంటుంది. చాలా మంది తమ కోరికలు తీర్చినట్లయితే నిప్పుల గుండంలో నడుస్తామని మొక్కుకుంటారు. అలాగే ఆ మొక్కును తీరుస్తారు కూడా. అయితే మరి నిప్పులగుండంలో నడిస్తే కాళ్ళు కాలవా? అంటే కాలవు అనే చెప్పాలి. ఎందుకంటే నిప్పుల గుండం పొడవు, వెడల్పు,లోతు అనేది ఒక ప్రత్యేకమైన కొలతల ప్రకారం చేస్తారు. అలాగే అందులోని బొగ్గులను ఒక ఉష్ణొగ్రత వరకూ వేడి చేస్తారు. అదనపు ఉష్ణొగ్రత కొరకు నేతిలో తడిపిన వస్త్రాలను పరుస్తారు. ఇక్కడ నిప్పుల గుండంలో నడిస్తే కాళ్ళు కాలక పోవడానికి 2 కారణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే 1. ప్రతీ మనిషి శరీరంలొనూ, అరికాళ్ళలోనూ కొంత తేమ ఉంటుంది. మనం నిప్పులపై కాలు వేసినపుడు ఆ వేడిని అరికాలిలోని తేమ పీల్చుకుంటుంది. కాబట్టి ఈ తేమ ఆరిపోయేలోపల మనము కాలు తీయవలసి వుంటుంది లేనిచో కాళ్ళు కాలిపోయే అవకాశం వుంది. అంతే కాకుండా నిప్పులపై నుశి/బూడిద ఉన్నా కాళ్ళు కాలతాయి. అందుకే బూడిద ఏర్పడకుండా విసురుతుంటారు. అంతేకాకుండా మన శరీరంలొనూ అదనపు తేమ కోసం నిప్పుల గుండంలో నడిచే ముందు తలారా స్నానం చేస్తారు. 2. అలా నడిచే తప్పుడు దైవ నామస్మరణ చేస్తూ తమను తాము హిప్నటైజ్ చేసుకుంటారు. ఈ రెండు కారణాల వల్ల నిప్పుల గుండంలో నడిస్తే కాళ్ళు కాలవు.
Subscribe to:
Post Comments (Atom)
9 comments:
meeru cheppina remDu kaaranaalu sariayinave..mamchi vishayaalu cheputunnaaru.
తెలుగు అభిమాని గార్కి,
నేను బ్లాగులకు కొత్త. మీరు వ్రాసిన కామెంట్ దేని గురించి అన్నది నాకు అర్ధం కాలేదు. నేను చేసిన పొరపాటు ఏమిటొ తెలియ చేస్తే దిద్దుకుంటాను.
అన్నీ అనుభవించే చెయ్యాలంటే ఏపనీ చెయ్యలేం.చేస్తుంటేనే అనుభవం వస్తుంది. రాస్తూంటే అదే వస్తుంది .కావలసినదల్లా ఉత్సాహం అది మీకు బోలెడుంది. so' keep going.
Viswanath thanks for u r encouragement
Very informative.Pl.Keep the good work going!
సీతారామ్ గారు క్షమించండి.
తెలుగు అభిమాని గారూ,
అంత మాట అనకండి, మీలాంటి వారు సహృదయంతో వ్రాసే కామెంట్లే మాలోని లోపాలను సరిదిద్దుకోవడానికి మరింత మంచిగా వ్రాయడానికి సహాయపడతాయి. మీరు నా బ్లాగుని ఎప్పూడూ చూస్తూ ఉండాలి. వాటిని విశ్లేషిస్తూ ఉండాలి మీ అభిప్రాయాలను తెలియచేస్తూ ఉండాలి. అదే నా కోరిక. నేను మీ అందరి ఆశిస్సులు కోరుకుంటూ... మీ ముందు ఎల్లపుడు చిన్నగానే ఉండాలని కోరుకూనే ... మీ సీతారాం.
కరని నారాయణ రావ్ గారికి, మీలాంటి పెద్దల ఆశీస్సులు ఎల్లపుడూ ఇలాగే ఉంటే మరిన్ని మంచి విషయాలు మీముందు ఉంచగలనని తెలియజేసుకుంటూ నమస్కారములతో... మీ సీతారాం
Post a Comment