ప్రియా ఎదురుచూపు ఎంత తీయనీదో నా కనులని అడుగు........ నీ మాటకున్న తియ్యదనమెంతో నా చెవులని అడుగు........ ప్రతిక్షణం నీ ఆలోచనలలో జీవిస్తున్నా నా తలపు ని అడుగు.... నిన్ను చూడనీ ఆ రోజు నా కళ్ళలో కన్నీళ్ళని అడుగు........ నువ్వు నా ఎదుట వున్నప్పుడు ఎంత ఆనందపడుతానో నువ్వు తిరిగి వెళ్ళినప్పుడు నా కనులు ఎంత రోదిస్తయో నా బాధని అడుగు......... ప్రతిక్షణం నిన్నే తలిచే నా గుండెని అడుగు......... ప్రతిరోజు నిద్రలో వచ్చే నా తీయటి కలని అడుగు...... నీవు నా ఎదుట వచ్చినప్పుడు మూగబోయిన నా మనసుని అడుగు. నీ కనులు చూసి సిగ్గుతో మాట్లడిన నా కనులుని అడుగు...... ప్రతిక్షణం నిన్నేతలిచే నా జ్ఞాపకాన్నీ అడుగు.............. నా మనసార ప్రేమించే నా మనసుని అడుగు ప్రేమంటే ఏ౦టో...... ఏదో ఒకరోజు నా ఎదురుచూపలకు ముగింపునిస్థావని ఆశతో...... నీ గుండెచప్పుడు......
నా ఆనందం నువ్వే నా మోదం నువ్వే.... నా వెలుగు నువ్వే నా చీకటి నువ్వే...... నా మరణం నువ్వే నా ప్రాణం నువ్వే.... నా ప్రేమ నువ్వే నా ఎడబాటు నువ్వే..... నా పయనం నువ్వే నా జీవిత గమ్యం నువ్వే.... నా కళ్ళు నువ్వే నా కనుచూపు నువ్వే.... నా గుండే నువ్వే నా గుండే చప్పుడు నువ్వే.... నా స్వప్నం నువ్వే నా మెలుకవ నువ్వే..... నా పలుకు నువ్వే నా మౌనం నువ్వే...... నా చిరునవ్వు నువ్వే నా రోదన నువ్వే....... నా తలపు నువ్వే నా వలపు నువ్వే....... నా అక్షరం నువ్వే నా కవితవు నువ్వే...... నా అణువణువునా నువ్వే నా జీవితం నువ్వే..... మోడుబారిన నా మనసుకు నీ చిరునవ్వుతో ప్రేమనీ పుట్టించావు..... కంటికి కనిపించని దూరంలో నీ వున్నా నా కనుపాపలో దాగుంది నీ రూపమే........ నీ అమాయకపు మనసు చూసి నా మనసు నీకు అర్పించాను......
ఎవరినీ ఆరాధిస్తుందో తెలియదు.... ఎందుకు ఆరాధిస్తుందో తెలియదు... ఇ పిచ్చిమనసు ఎవరినీ ఎప్పుడు ఇష్టపడుతుందో తెలియదు.... ప్రేమ కలగడానికి ఒక్క క్షణం చాలు.. ప్రేమ కలగడానికి ఒక్క చూపు చాలు. ప్రేమ కలగడానికి ఒక్క మాట చాలు.. ఎన్ని జన్మలైన మరచిపోదు నీ ప్రేమనీ...... నా తీయటీ ప్రేమ కావ్యం నీ తొలిప్రేమ.........
నువ్వులేని నా ప్రేమకు గుండేందుకు నువ్వులేని నా ప్రాణానికి ఉపిరెందుకు నువ్వులేని నా పయనానికి గమ్యం ఎందుకు నువ్వులేని నా చీకటి బ్రతుకుకి వెలుగు ఎందుకు నువ్వులేని నా కవితకు అక్షరం ఎందుకు నువులేని నా జన్మ ఎందుకు నువ్వులేని నా బ్రతుకుకు సంతోషం ఎందుకు నువ్వులేని నా తలపుకు ఊహ ఎందుకు నువ్వులేని నా కంట్లో కన్నీళ్ళు ఎందుకు నువ్వులేని నా గుండేకు చప్పుడు ఎందుకు నువ్వులేని నీ రూపం చూడనీ నా కనులు ఎందుకు నువులేని నా జీవితం ఎందుకు....... నువ్వులేక నేనులేను నువ్వులేక ఎప్పటకి నేనుండాలేనునువ్వులేక నేనులేను నేనులేను
నీతో మనసువిప్పి మాట్లాడాలి అనుకున్న క్షణం నా మనసు పలికే రాగాలను నీకు వినిపించలేక మౌనమే సమాధానంగా నా గొంతు మూగబోతుంది...!! నిన్ను చూస్తూ నా మనసు కలల లోకంలో విహరిస్తుంది... నీ నీడే నేనుగా , నీ శ్వాసే నా ఉపిరిగా, నీతో విహరించే మదురమైన క్షణాలను చూస్తూ కాలం కరిగిపోయింది...!!
కానీ నీతో 'చెప్పాలన్న మాట' మాత్రం మిగిలి పోయింది... ------------ "రేపటి కోసం" -------------
ఎగిసిన ప్రతీ అల తీరాన్ని తాకుతుందో లేదో తెలీదు కానీ ...! నువ్వు చూసే ప్రతీ చూపు నా గుండెను తాకుతుంది...!! దూసుకోచ్చే ప్రతీ చినుకు భూమిని ముద్ధాడుతుందో లేదో తెలీదు కానీ..! నువ్వు నవ్వే ప్రతీ నవ్వు నా హృదయాన్ని ముద్దాడుతుంది...!! ఆకాశంలో మెరుపు మెరుస్తుందో లేదో తెలీదు కానీ...! నా మనసుకు మాత్రం నీ ఫిలుపు వినిపిస్తుంది..
ప్రతీసారి నీకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్న. అర్థం చేస్కోవేం...? ఎందుకు నాకు ఊర్కే ఫోన్ చేస్తావ్...? నేనేమైపోతే నీకేంటి...? మళ్ళి నా జీవితంలోకి రావాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావ్..? నాకు నువ్వంటే పిచ్చి... ఆ పిచ్చిలో నా జీవితాన్ని కోల్పోతానేమో అని భయమేస్తుంది.. మనం ఈ జన్మలో కలవలేం.. అలాంటప్పుడు మనమధ్య ఈ అనుసంధానం అవసరమా..? నువ్ నా బలహీనత.. నా బలహీనతతో ఆడుకోవడం నీకు ఆనందాన్నిస్తుందా..? నాకు తెలుసు నేనంటే నీకు చాల ఇష్టమని... నాకు తెలుసు నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావని.. నీకు ముందే చెప్పాను నన్ను మర్చిపోవడం నీకు నువ్వనుకున్నంత సులువు కాదని నేను కూడా నీ గురించి ఇలానే అనుకున్న... నువ్వంటే నాకు పిచ్చి... పిచ్చి కాదు ప్రాణం... కాని మనం కలవలేం మన మద్య మనకు తెలియని అడ్డంకి ఉంది. దాన్ని దాటుకుని నీచెంతకు రాలేను నిన్ను నాదగ్గరకి రానివ్వను... ఒకప్పుడు భయపడ్డాను నేను లేకుండా నువ్ ఎలా బ్రతుకుతావోనని కాని నేను లేకున్నా నువ్ హ్యాపీ గా ఉండగలవని నువ్వే నేరూపించావ్ కదా బంగారు నిర్దాక్షిణ్యంగా నన్ను దూరం పెట్టావ్ కదా ఇప్పుడు దగ్గరకు రమ్మంటే ఎలా రావాలో అర్థం కావడం లేదు నేనన్న మాటలు నన్నే సూదుల్లా పోడుస్తున్నాయ్ నువ్ చేసిన పనులు నన్ను అధః పాతాళానికి నేట్టేస్తున్నాయి నీ నేను ఏనాడో మరణించాను నాకు నేనుగా బ్రతుకుతున్న ప్రశాంతంగా గతం వీడి భవిష్యత్ లోకి ప్రయాణిస్తున్న మళ్ళి నా జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తున్నావ్ నా బలహీనత ఏంటంటే మళ్ళి నీ ప్రేమలో సులభంగా పడిపోగలను
నీ రాకకై , నీ చూపుకై ఎదురుచూసిన నా హ్రుదయం నీవు రావని తెలిసి మౌనంగా రోదిస్తుంది ....
నీ తలపుకై , నీ పిలుపుకై ఎదురుచూసే నా మనసు నీవు లేవని తెలిసి మాటలు రాక మూగబోయింది ..... కళ్ళకు ఆనకట్ట వేసి కన్నీళ్లను ఆపగలుగుతున్నాను కానీ ..! సాగరతీరంలో కెరటాల వలె ఎగసిపడే నా హృదయా వేదనను ఆపలేక పోతున్నాను ....