మీలో చాలామందికి ప్రేమకు, పెళ్ళికి తేడా ఏమిటో తెలుసుకోవాలని వుంటుంది. చాలా మందికి తెలిసే వుంటుంది. మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియ చేయండి. ఎన్ని తేడాలు వస్తాయో చూద్దాం. ముందుగా నేనే ప్రారంభిస్తా.
ప్రేమలో ఉన్నపుడు ఈమెనే ప్రేమించాలి అనిపిస్తే,
పెళ్ళి అయిన తరువాత ఈమెనెలా ప్రేమించాను అనిపించడం.
-------------------
భవాని గారు: ప్రేమ మనకోసం. పెళ్ళి మన చుట్టూ ఉన్నవాళ్ళ కోసం.
కత్తి మహేష్ కుమార్ గారు : ప్రేమ ఆనందం కోసం, పెళ్ళి అనుబంధం కోసం
లక్ష్మి గారు : ప్రేమ గుడ్డిది, పెళ్ళి మూగది.
మళ్ళీ నేను : ప్రేమలో ఉన్నపుడు ఇద్దరికీ క్లోజప్ నచ్చితే,
పెళ్ళయ్యాకా ఒకరికి కోల్గేట్ మరొకరికి పెప్సోడెంట్ నచ్చుతుంది.
మరి మీ ఉద్దేశ్యం?
9 comments:
మీరు సరదాగానే రాశారు గానీ.. మీ పోస్ట్ టైటిలు చూసి చాలా మంది ఇక్కడికొస్తారు. అందుకే ఈ చిన్న వీడియో లింక్ ఇస్తున్నా.
http://www.youtube.com/watch?v=4GqUirhJHWI
ప్రేమ మనకోసం. పెళ్ళి మన చుట్టూ ఉన్నవాళ్ళ కోసం.
@bhavani
keka samadhanam
ప్రేమ ఆనందం కోసం, పెళ్ళి అనుబంధం కోసం.
prema guddidi, pelli mugadi
ప్రేమంటే ఒకరు లేకపొతే మరొకరు బ్రతకలేకపోవడం .
పెళ్ళంటే ఒకరి కోసం ఒకరు బ్రతకడం .
ప్రేమలో సరసం అంటారు పెళ్ళైతే రుసరుసలంటారు.
my version
ప్రేమ వేరు పెళ్లి వేరు కాదు.
ప్రేమ 'committment' కోరితే అది పెళ్లి.
ప్రేమ అంటే ఇద్దరికీ పరస్పర ఇష్టం.
పెళ్లి అంటే కలిసి ఉందామనే 'committment'.
ఈ రెండిట్లో ఏది లేకపోయినా తప్పదు విడాకుల కష్టం.
లేదంటే జీవితమే ఒక పెద్ద నష్టం.
Post a Comment