Monday, June 15, 2015

కారే కన్నీళ్ళకి

గుండెలోని బాధ కళ్ళలో
నీరుగా మారి
కారిపోయిన క్షణాలెన్నో..

గుండె కరగలేదు
నీరు ఇంకలేదు..

జరిగేది జరుగుతూనే ఉంది
కారే కన్నీళ్ళకి చెలియ కట్టలు లేవు ..

సాగేది జీవితం
జరిగేది సంఘర్షణ.

మనసుకూ మనిషికీ
మిగిలేవి కన్నీళ్ళే...

కళ్ళ నిండా నీరే
తోవ కానరాని కన్నీటి చెలమలే..

అడుగడుగున
గుండె బరువు తీరినా..

మనసు కుదుట పడినా
కన్నీళ్ళ వల్లేనేనేమో. ..

కురిసి కురిసి వెలవటం
ఆగి ఆగి వర్షించటం కళ్ళకే తెలుసేమో..

లోతే తేలని అంతరంగపు
ఊటబావులు కళ్ళు..

దెబ్బ మనిషికి తగిలినా
మనసుకి తగిలనా,మనవారికి తగిలినా-
ముందుగా వచ్చేది మత్రం కన్నీళ్ళే..

ఏదురు చూపులెన్ని చూసినా
అలసిపోవు.
ఎండమావి రూపాలయినా
వెతకనీయవు కళ్ళకొలికెలు...

వయసు తారతమ్యాలను
లింగ బేధాలను సయితం
మరచి కారుతాయీ కన్నీళ్ళు..

ఆనందంలోనూ,బాధలోనూ
తోడు వస్తాయి ఈ కన్నీళ్ళు

No comments: