మౌనంగా మాటాడలేక చూస్తూ ఉన్నా
మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ..
ఇన్నాళ్ళ సాంగత్యంలో ఏనాడు లేని భావన
ఈరోజు నీవు దూరం అవుతూ ఉంటే
నాప్రాణమే పోతుంది అన్న భావన
మదిని తొలిచి వేస్తుంది
దగ్గరగా నువ్వు ఉన్నన్నాళ్ళు నన్ను నేను మరిచా
నేడు నీవు వెళ్తునావు అంటే నిన్ను మరవలేక ఉన్నా
దగ్గరలో తెలియని భావం
నీవు దూరం అవుతూ ఉంటే
దాని విలువ తెలిసి వస్తూ ఉంది
కోపాలు అలకలు దీనితోనే సగం సమయం
ఇప్పుడు అనిపిస్తూఉంది
ఇంకాస్త సమయం ఉంటే బాగుండు అని
చెప్పలేక మౌనంగా ఉన్నా
మదిలో చెప్పుకుంటూ నిన్ను బాధిస్తే మన్నించు
ఒక్క అవకాశం వస్తే నీ చేయి ఎన్నడు వీడను అని
కాలంతో ప్రాయాణం మొదలు పెడుతూ
నీ జ్ఞాపకాలని పదిలం చేసుకుంటూ
నీ రూపు గుండెల్లో దాచుకుంటూ
భారంగా వెనుదిరుగుతూ ..
మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ..
ఇన్నాళ్ళ సాంగత్యంలో ఏనాడు లేని భావన
ఈరోజు నీవు దూరం అవుతూ ఉంటే
నాప్రాణమే పోతుంది అన్న భావన
మదిని తొలిచి వేస్తుంది
దగ్గరగా నువ్వు ఉన్నన్నాళ్ళు నన్ను నేను మరిచా
నేడు నీవు వెళ్తునావు అంటే నిన్ను మరవలేక ఉన్నా
దగ్గరలో తెలియని భావం
నీవు దూరం అవుతూ ఉంటే
దాని విలువ తెలిసి వస్తూ ఉంది
కోపాలు అలకలు దీనితోనే సగం సమయం
ఇప్పుడు అనిపిస్తూఉంది
ఇంకాస్త సమయం ఉంటే బాగుండు అని
చెప్పలేక మౌనంగా ఉన్నా
మదిలో చెప్పుకుంటూ నిన్ను బాధిస్తే మన్నించు
ఒక్క అవకాశం వస్తే నీ చేయి ఎన్నడు వీడను అని
కాలంతో ప్రాయాణం మొదలు పెడుతూ
నీ జ్ఞాపకాలని పదిలం చేసుకుంటూ
నీ రూపు గుండెల్లో దాచుకుంటూ
భారంగా వెనుదిరుగుతూ ..
No comments:
Post a Comment