Saturday, November 24, 2007

జ్యోతి-The Light of Telugu Bloggersజ్యోతి-ఈ పేరు గురించి తెలుగు బ్లాగర్లకు ఎవరూ పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే సంవత్సర పైగా తెలుగు గుంపులో ఉంటూ, తన బ్లాగులలో 1000కి పైగా పోస్టులు చేసి ప్రచండ బ్లాగరి అనే బిరుదు పొందిన ఏకైక తెలుగు మహిళ మన జ్యోతి గారు. జ్యోతి వలబోజు గా కంటే జ్యోతక్కగానే అందరికీ పరిచయం. ఈమె బి.కాం.వరకూ చదివిన సాధారణ గృహిణి అంటే ఎవరికీ నమ్మశక్యం కాదు. అలా వుంటాయి ఆమె రచనలు. ఆమె స్పృశించని విషయం లేదు. ఆవకాయ పచ్చడి నుండి హైదరాబాది బిరియాని వరకూ వంటలు, ఆత్రేయ నుండి హిమేష్ రేష్మియా వరకూ పాటలు, నవ్వుల పువ్వులు పూయించడం దగ్గరనుండి మెదడకు పదును పెట్టి నవ్వించే ఫజిల్స్ వరకూ హాస్యం,పురాణ విషయాలు, కవితలు అన్ని రకాలు ఆమె బ్లాగుల నుండి జాలు వారినవే. వీటన్నిటి కంటే ముఖ్యంగా ఆమె సహన గుణం మరియు సహాయ గుణం గురించి చెప్పు కోవాలి. ఈ పోస్ట్ నేను వ్రాయాలనుకోవడానికి ముఖ్య కారణం అదే. అసలు బ్లాగు అంటే ఏమిటో తెలియని నాలాంటి వారికెందరకో తన అమూల్యమైన సలహాలు,సూచనలతో బ్లాగులు నెలకొల్పడానికి కారణమయ్యారు. ఆవిడ కృషి మూలముగానే మన తెలుగు బ్లాగర్స్ అందరికీ ఉపయోగపడే ఒక సాంకేతిక బ్లాగు తయ్యారయ్యిందని మనకు తెలుసు. అదే నల్లమోతు శ్రీధర్ గారి శ్రీధర్ సాంకేతికాలు. మన తెలుగు బ్లాగర్లు వ్రాసే పోస్టులను చదివి వాటిపై వ్యాఖ్యలు వ్రాస్తూ బ్లాగర్లలో కొత్త ఉత్సాహన్ని నింపుతుంటారు. కంప్యూటర్ ఎరాలో ఆమె వ్రాసిన తెలుగు వెలుగులు వ్యాసం ఆమె కీర్తి కిరీటంలొ ఒక కలికి తురాయి. సార్ధక నామధేయం అంటే ఏమిటో జ్యోతి గారిని చూసాకే తెలిసింది. జ్యోతి ఏ విధంగా తన వెలుగు ద్వారా ఇతరులకు మార్గం చూపుతుందో, మన జ్యోతిగారు కూడా తన సలహాలతో బ్లాగర్లకు దారి చూపిస్తుంటారు. ఆవిడను ఏ విషయం అడిగినా విసుగు చెందక చాలా ఓపికతో చెబుతుంటారు, ఆమెకు తెలియని విషయమైతే, తెలిసిన వారిని అడిగి మరీ మన సందేహాలు తీరుస్తుంటారు. అందుకే ఆవిడను తెలుగు బ్లాగర్లకు వెలుగురేఖ అని పోల్చడంలొ అతిశయోక్తి లేదేమో. మన తెలుగు బ్లాగర్లు గుంపులోని సంఖ్య 1000కు చేరుకుంటున్న శుభసందర్భములో జ్యోతి గారికి అనె బిరుదుని గాని అటువటి సమాన అర్ధం వచ్చే తెలుగు పదంతో గాని సత్కరిస్తే బావుంటుందేమో. మీ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో వ్రాయండి.

8 comments:

నల్లమోతు శ్రీధర్ said...

సీతారాం వానపల్లి గారూ, నిజమే జ్యోతి గారి గురించి ఎంత రాసినా తక్కువే. మనసుంటే ఆవిడని చూసి ఎన్నో నేర్చుకోవచ్చు. ఒక గృహిణిగా అన్ని పనులను చక్కదిద్దుతూ ఇలా అందరిలో ఉత్సాహం నింపుతూ నిరంతరం తాను కష్టపడే స్వభావం ఎంతో ప్రశంసించదగ్గది. హ్యాట్సాఫ్ టు హర్.

- నల్లమోతు శ్రీధర్

జ్యోతి said...

సీతారాం, మరీ ఎక్కువ పొగిడేస్తున్నావు .. నాకు తెలిసింది ఇతరులతో పంచుకోవాలని తప్ప వేరే ఏ కోరిక, ఆకాంక్ష లేదు.ఎప్పుడుగాని మనకు తెలిసిన ఏ విషయమైనా అది అవసరమైనవారికి చెప్పడంలో అమితమైన ఆనందం ఉంటుంది. దాచుకుంటే కుళ్ళిపోతుంది. ఏ పని చేయాలన్నా ఇది నాకు రాదు, నావల్ల కాదు అని అనుకోకూడదు. ఎందుకు రాదు అని ఒకటికి పదిసార్లు ప్రయత్నించాలి. మనసుంటే మార్గముంటుంది. అసాధ్యమనేది ఏదీ లేదు. కాని కాస్త కష్టపడాలి. బద్ధకం వీడాలి ఎవరైనా. ఇదే నా పాలసీ. చెప్పడమే కాదు నేను అలానే చేస్తాను కూడా...ఆ పైనా మిత్రుల సహకారం, ప్రోత్సాహం ...

కందర్ప కృష్ణ మోహన్ - said...

నల్లమోతు శ్రీధర్ గారి వ్యాఖ్య...
రెండోస్సారి..

రాకేశ్వర రావు said...

జ్యోతిగారికి జైజైలు

cbrao said...

జ్యోతక్క చిరుదీపంలా వచ్చి,ఉరుము గా మారారు. అతి తక్కువ కాలం లో, ఎక్కువ టపాలు రాసి, తెలుగు బ్లాగు చరిత్రలో కొత్త 'record' సృష్టించారు. నలుగురికీ సహయపడాలనే తత్వం, ఆమె లో మెచ్చుకో తగ్గది.

డా.వి.ఆర్ . దార్ల said...

నిజమండీ... ఆమె రచనలు చాలా బాగుంటాయి. ఆమె ఏమి రాసినా బాగుంటుందన్నట్లుంటాయి. జ్యోతి గారు వెయ్యి రచనల మైలరాయి ని చేరుకోబుతున్నందుకు శుభాకాంక్షలు
దార్ల

గీతాచార్య said...

RighttO

మాలా కుమార్ said...

నేను పెట్టుకున్న పేరు ఆపత్బాంధవి