Thursday, October 4, 2007

చేతులకు గాజులు తొడిగించుకోవడం అనేది ఎలా వచ్చిందో మీకు తెలుసా?



చేతులకు గాజులు తొడిగించుకోవడం గురించి ఒక పురాణగాధ వుందిలేండి. అదేమిటంటే జమదగ్ని మహాముని మహా కోపిష్టి. అది జగమెరిగిన సత్యం. అతని భార్య రేణుకా దేవి. ఆవిడ మహా పతివ్రత. అందుచే ఆవిడ ఇసుక రేణువులతో చేసిన కుండతో నీళ్ళు తీసుకు వచ్చేదట. అయితే ఒక రోజు ఆవిడ కుండతో నీళ్ళు తీసుకుని వస్తుండగా దశరధ మహారాజు ఆ దారంటా వెళుతున్నాడట. అపుడు ఆమె ఔరా! ఈ రాజెంత అందగాడు అనుకున్నదట. వెంటనే ఆ కుండ పగిలి పోయిందట. ఆశ్రమానికి వట్టి చేతులతో వచ్చిన రేణుకాదేవిని చూసి, జరిగినదంతా దివ్య దృష్టితొ గ్రహించి వెంటనే కుమారుడైన పరశు రాముడితో నీ తల్లిని నరికేయమన్నడట. పితృవాఖ్య పరిపాలకుడైన పరశురాముడు ఎందుకు ఏమిటి అని అడుగకుండా తల్లిని తన గండ్ర గొడ్డలితో నరికేసాడట. తరువాత తన తల్లి మరణానికి రాజ వంశీయులే కారణమని తలచి వారిపై పగబట్టి అసలు ఈ భూమిపై క్షత్రియుడనేవాడు లేకుండా చేస్తానని ప్రతిన బూని కనిపించిన క్షత్రియుడనల్లా హతమార్చేవాడంట. ఒకసారి అతను అయోధ్యా నగరానికి విచ్చేసాడంట. అప్పటికే అతని గురించి వినివుండటంతో దశరధుడు పారిపోయి రాణి వాసములో దాక్కున్నాడంట. అపుడు పరశు రాముడు రాణి వాసమునకు వచ్చి రాజు ఇక్కడ వున్నడా అని అడిగితే లేరని సమాధనమివ్వగా ఒప్పుకోక మీరంతా వచ్చి నాముందు నిలుచోండి అనగా రాణి వాసపు స్త్రీలు ఎవ్వరూ పరాయి పురుషుని కంట పడరని, కావాలంటే మాచేతులు బయటకు పెడతాము వాతికి వున్న గాజులను మీరు చూడవచ్చును అని తెలుపగా, పరుశరాముడు అలాగే కానిమ్మని పలుకగా దశరధుడు రాణి వాసపు స్త్రీలతో బాటు చేతులకు గాజులు తొడిగించుకుని బైటకు చేతులు బయట పెట్టడత. అపుడు సరేనని పరశు రాముడు వెనుదిరిగాడంట. ఆ విధముగా దశరధుడు ప్రాణాలు కాపాడుకున్నడట. అప్పటినుండి ఎవరైన ఏదైనా ఆపద వచ్చినపుడు ధైర్యంగా ఎదుర్కొనక మూలన కూర్చుంటె చేతులకు గాజులు తొడిగించుకున్నవా అని అనడం పరిపాటి అయ్యిందట. ఇది నా చిన్నపుడు మా పెద్దలు చెప్పగా తెలుసుకున్నాను. ఇందులో ఏవైన దోషాలుంటె తెలియ చేస్తే దిద్దుకుంటాను.

3 comments:

Betaludu said...

మీ బ్లాగు చల్ల బాగుంది.నేను కూడా ఈ మధ్యే తెలుగులో బ్లాగు రాయడం మొదలు పెట్టాను.మీ ప్రొఫైల్ లో మీది తణుకు అని ఉంది మాది కూడ అదే ఊరు.ఇది నా బ్లాగు అడ్డ్ర్రస్ చదివి ఎలాగుందో తెలుప ప్రార్ధన
http://naakathalu.blogspot.com/

నా కథలు...... said...
This comment has been removed by the author.
Unknown said...

నేను మరచిపోయిన ఈ విషయాన్ని గుర్తుచేసారు