Tuesday, September 4, 2007

మీకు కోతి పుండు బ్రహ్మ రాక్షసి అనే సామెత గురించి తెలుసా?

కోతులు సహజంగా సమూహాలుగా గాని, కొన్ని గాని కలసి సంచరిస్తూ ఉంటాయి. అవి చెట్ల మీద నుండి చెట్ల మీదకు ఎగురుతూ వెడుతుంటాయి. ఊళ్ళలొ అయితే ఇళ్ళ ప్రహారీ గోడల మీద ఒకటి వెనుకగా ఒకటి పోతుంటాయి. అలాగే అడవులలో కూడా గుంపులుగానే జీవిస్తుంటాయి. అవి అలా సంచరించేటప్పుడు దెబ్బలు తగలడం వల్ల గాని లేదా వేటగాడు ప్రయోగించిన రాయి లేదా ఆయుధం వల్ల గాని ఒక కోతి గాయపడితే మిగిలిన కోతులు ఆ కోతిని పరామర్శ చేస్తాయి.అలా ప్రతీ కోతి ఆ గాయపడిన కోతిని పరామర్శించేటప్పుడు తన చేతి గోళ్ళతో ఆ గాయాన్ని గోకి చూసి ఏదో ఆకు తెచ్చి దానిమీద వేసి వెడుతుంది. అవి ఆ విధంగా తమ సానుభూతిని, ఆపేక్షను వెల్లడిస్తాయి. కాని ప్రతీ కోతి ఆ గాయాన్ని గోకి చూడడం వల్ల ఆ కోతికి తగిలిన గాయం చిన్నదైనా అది పెద్దగా విస్తరించి చివరికది మానడం దుర్లభమవుతుంది. ఆ కారణంగానే "కోతిపుండు బ్రహ్మ రాక్ష్సి" అనే సామెత వాడుకలోనికి వచ్చింది. ఇది కోతుల నైజాన్ని తెలిపే సామెత. ఆపేక్షతో చేసినప్పటికీ అజ్ఞానులు చేసే పనులు చివరికి బాధగా పరిణమించడాన్ని తెలియజెయడానికి ఈ సామెతతో సూచిస్తారు.

2 comments:

రానారె said...

కోతి పుండు బ్రహ్మరాక్షసి అనే సామెత తెలీదుగానీ, కోతి పుండు బ్రహ్మాండం అనే సామెత తెలుసు - ఒక కోతికి చిన్న పుండైతే మిగతా కోతులు సొంతవైద్యంచేసి దాన్ని బ్రహ్మాండమంత (ఆకాశమంత/అంతరిక్షమంత) పెద్దదయేలా చేస్తాయనే అర్థంలో.

Naga Pochiraju said...

good info