భారత యుద్దం ముగిసిన తరువాత ధర్మరాజు మరణించిన తన బంధు మిత్రులందరికీ పితృకార్యం చేస్తున్నాడు. ఆ సమయంలో కుంతీదేవి కర్ణుడికి కూడా పితృకార్యం నిర్వహించమని ధర్మరాజుకు చెప్పింది. ఆమె అలా కోరడానికి కారణమేమిటని ధర్మరాజు ఆమెను ప్రశ్నించాడు. అప్పుడు కుంతి తాను కన్యగా వున్నపుడు సూర్యుడి వరం వలన కర్ణుడు తనకు పుట్టిన సంగతి తెలిపింది. ఆ విషయం తెలిసిన ధర్మరాజు ఎంతో దుఃఖించాడు. కర్ణుడు ఆమెకు తమకంటే ముందుగా పుట్టిన కారణంగా అన్న అవుతాడని, అతడిని తమ చేతులారా చంపామని ఎంతో బాధ పడ్డాడు. అతడికి కుంతిపై విపరీతమైన కోపం వచ్చింది. ఆ విషయం ముందేచెప్పివుంటే అతడితో తమకు వైరం వుండేది కాదని, అసలు భారత యుద్డం సంభవించేదే కాదని పలికి ఆమె ఆ రహస్యం అంతకాలంగా దాచబట్టే ఈ దుష్పరిమాణం ఏర్పడిందని చెప్పి "ఇకపై స్త్రీల నోట రహస్యం దాగదు" అని శపించాడు. ఈ భారత గాధ ఆధారంగానే "స్త్రీల నోట నువ్వు గింజ నానదు" అనే సామెత వాడుకలోకి వచ్చింది. నువ్వుగింజ నానడానికి ఎంతోసమయం పట్టదు. అటువంటి నువ్వుగింజ నానే సమయం స్త్రీలు తమ నోట ఇవ్వరని అర్ధం. స్త్రీలు నిరంతరం ఏదో విషయం మాట్లాడతారని, మాట్లాడక ఊరకనే వుండలేరని దీని భావం. కాని సామాజికంగాను, వైజ్ఞానికంగాను స్త్రీలు అభివృద్ది చెందుతున్న ఈ కాలంలో ఈ సామెతకి అర్ధం వుండదని చెప్పవచ్చు.
Tuesday, August 28, 2007
Wednesday, August 22, 2007
మీరు మీ ఇంటిలోనే స్వంతముగా ఒక వెండి గుడ్డు తయారు చేసుకోవాలనుకుంటున్నారా?
అవునండీ. మీరు మీ ఇంటిలోనే స్వంతముగా ఒక వెండి గుడ్డు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వెండి ఎక్కడనుండి తీసుకురాము అనుకునేరు.ఈ గుడ్డుకి నిజమైన వెండి అవసరం లేదు. ఇది ఒక సైన్సు ఇంద్రజాలం. ఇది తయారు చేయడానికి మీకు కావలసినవి. ఒక గుడ్డు, గాజు గ్లాసు, అందులో పూర్తిగా నీరు, ఒక దీపం అవసరం. ముందుగా దీపాన్ని వెలిగించి గుడ్డును దానికి కొంచెం దూరంలో పట్టుకోవాలి దాని పొగ తగిలేటట్టు ఉండాలి. అపుడు గుడ్డు నిండా మసి అంటుకునేటట్టు చూడాలి. గుడ్డు మొత్తం నల్లగా తయారైన తరువాత దానిని జాగ్రత్తగా గాజు గ్లాసులో ఉన్న నీటిలో వేయండి. ఇప్పుడు చూడండి మీకోసం ఒక వెండి గుడ్డు తయారుగా వుంటుంది. నల్లటి గుడ్డు నీటిలో ఎలా మెరిసి పోతుందో మీరే చూడగలరు.
Friday, August 17, 2007
మీకు Numberని No. అని, That is ని i.e. అని, OK అంటే All Correct అని ఎందుకు వ్రాస్తామో తెలుసా?
No. అనునది Latin పదమైన Numero నుండి గాని, Old French పదమైన Nombreనుండి గాని తీసుకొని వుండవచ్చు. అలాగే i.e అనునది Latin పదమైన id est నుండి తీసుకొని వుండవచ్చు దీనికి English లో సమాన అర్ధం that is. OK అనునది orl korrect నుండి తీసుకొని వుండవచ్చు. an early 19th century American phonetic spelling of 'all correct'.
Subscribe to:
Posts (Atom)