Wednesday, March 18, 2015

నీ పెదవంచు చిరునవ్వులో..,

వెన్నెలై చేరనా
నీ కలువ కన్నులలో..,
మొగ్గనై పూయనా...,
నీ పెదవంచు చిరునవ్వులో..,
ప్రేమపుష్పమై విరియనా
నీ హృదయపు తావిలో...,
తోడునై నడవనా
నువు వేసే ప్రతి అడుగులో..,
నన్ను నేనే మరచిపోనా
నీ తలపులు నను తాకే నిమిషములో...!!!

Saturday, March 14, 2015

నీవు తోడుంటే

ప్రియా!
నీ చిలిపి అల్లరుల కొంటెతనం
నా తనువంతా చేసెను గడసరి మారాం
నిత్యం నే కోరుకుంటున్నా నీ అనురాగం
నీవు తోడుంటే కొత్తగా ఉంది ఈ ప్రపంచం
ప్రతి ఉదయం నామది ముంగిట వికసించే నీ ప్రేమ కుసుమం
నీ నీడలో నా బ్రతుకంతా అయింది బృందావనం
ఈ జీవితం ఇక అనుకున్నా నీ కోసం
మనసా,వాఛా చేసా ఎపుడో నీకే అంకితం....!

ప్రతి క్షణం నీతో

మాట్లాడటమే సరిగా రాని నేను
ప్రతి క్షణం నీతో
మాట్లాడటానికే వేచి చూసేదాన్ని..
ఎవరిని పట్టించుకోని నా కళ్ళు
నీ దర్శనం కోసం ఎప్పుడూ
ప్రతిక్షణం వెతుకుతుండేవి..

నువ్వు లేనప్పుడు నాది ఒంటరి ప్రపంచం
నువ్వు వచ్చాక నేను
మరిచాను అ ప్రపంచం..
నీవు పరిచయం కానప్పుడు నేనెవ్వరో అన్న ఫీలింగ్
నువ్వు వచ్చాక నాలో ఎక్కడో చెప్పలేని దైర్యం..
ఇంతకు ముందు నాకోసం నేను..
నువ్వు వచ్చాక నీకోసం
చావునైనా ఎదిరించే తెగింపు..
ఎమిటో మరి ఏమాయ చేసావో
నువ్వు ఇలా వచ్చి..
అలా వెళ్ళిపోయావు
ఎందుకిలా జరుగుతోంది అని అడుగలేను..
నీవు మారావు ..
నన్ను ఏమార్చావు.
నీవున్నప్పుడు ప్రపంచంలోని సంతోషం అంతా నాదే.
ఇప్పుడు ప్రపంచంలో దుఃఖం అంతానాదే ..
ప్రతిక్షణం గుర్తుకొస్తున్నాను అన్న నీవే..
నేను అనే దాన్ని అసలెరుగను అన్నట్టుంటే ..
నా మనసుకు సమాధానం ఏమని చెప్పుకోను..
ఎందాకని ఊరడించను...చెప్పు
ఇలా ప్రతిక్షణం నీకోసం ఆలోచించే గుండె ఎప్పుడో ఆగిపోతుంది..
అయినా నీమనస్సు కరుగదు అలా తయారయ్యావు ఎందుకో..?

Friday, March 13, 2015

ఏమని వర్ణించను

చెలీ!
ఏమని వర్ణించను నీ సొగసులను
సెలయేటి అలలులా నీ నల్లని కురులు
ఆ కురులలో అలల మాటున నురగలులా సన్నజాజుల ఘుమఘుమలు
కలువపూలను మైమరపించే నీ కాటుక కనులు
పున్నమి చంద్రుని పోలే నీ నుదుట తిలకం
నీ ఎర్రని అధరాలు చిందించే తీయని మకరందం
సూర్యకాంతిలా ప్రతిబింబించే నీ ముఖ సౌందర్యం
పడుచుదనం పరువాలను పైటచాటున దాచుకుని
గడుసుదనం కలగలిపి కొంటేగా నను చూస్తుంటే
నిలువగలరా ఎవరైనా నీ చూపులు తాకి
కారా దాసులు నీ సుందర రూపానికి......!

Thursday, March 12, 2015

నీ చూపుల కిరణాలు

మేని పులకించిపోతుంది
నీ చూపుల కిరణాలు సుతిమెత్తగా
యదను మీటుతుంటే..,
మది మురిసిపోతుంది
నవ్వుల రత్నాలు నాపై చల్లేస్తుంటే..,

ప్రాణం గాలిలో తేలుతుంది
నీ ఊహా చిత్రానికి ప్రాణంపోస్తుంటే..,
భావం తడబడుతోంది
శిలలాంటి నా మదిలో శిల్పంలా నువు మారుతుంటే..,
ఏమని చెప్పను ఈ భావాన్ని
ఎలా చూపను మనసులోని ప్రేమని..!!

Sunday, March 8, 2015

తెలుసా అవేంటో

తీరిక లేని ఎన్నో పనులు
తెలుసా అవేంటో
నీకోసం ఎదురుచూడాలి
నిన్ను చూడాలి
నీతో మాట్లాడాలి
నీ పలుకు వినాలి
నీతో నవ్వాలి
నిన్ను నవ్వించాలి
నీతో కలిసి నడవాలి ఇలా అన్నీ ..
ఇన్ని తీరికలేని పనులమద్య
సూర్యుడు ఎప్పుడొచ్చివెలుతున్నాడో కూడా తెలీడంలేదు నేస్తం .. !!!!